వారెవా: పాకిస్తాన్ జీడీపీని దాటేసిన టాటా గ్రూప్ విలువ?
స్వాత్రంత్ర్యానంతరం మన నుంచి విడిపోయిన పాకిస్థాన్ తో మనల్ని పోల్చి చూసినప్పుడు మనం ఎంత సాధించామో అర్థం అవుతుంది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లు. అంటే రూ.296లక్షల కోట్లు. ఈ మొత్తం పాకిస్థాన్ కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. మనదేశం ఎఫ్ వై 28 నాటికి జపాన్, జర్మనీ రెండింటినీ అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచ వ్యాప్తంగా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం.. పాకిస్థాన్ జీడీపీ 341 బిలియన్ డాలర్లు. అంటే 28.3లక్షల కోట్లు. మన దగ్గర నమ్మకానాకి మారుపేరుగా నిలిచే టాటా గ్రూపు మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లు. అంటే 30.3లక్షల కోట్లుకు చేరుకుంది. ఇది పాకిస్థాన్ జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం.
పాకిస్థాన్ జీడీపీ మించి టాటా గ్రూప్ వాల్యూ నమోదైంది. సంస్థ స్థాయిలో వృద్ధి సాధించడానికి కారణం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అని చెప్పవచ్చు. ఈ ఒక్క కంపెనీ విలువే 170 బిలియన్ డాలర్లు. అంటే దీని వాల్యూ రూ.15లక్షల కోట్లు. దీని మార్కెట్ విలువ పాకిస్థాన్ ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు సగానికి సమానం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందామో లేదో.. అయితే దీనిని ప్రపంచానికి చెప్పే ముందు మన దేశంలో ఉంటూ మనల్ని విమర్శించే వారికి చెప్పాలి.