గోల్డ్ లోన్స్‌పై తక్కువ వడ్డీ తీసుకునే టాప్ బ్యాంక్స్ ఇవే..?
అసలు గోల్డ్ లోన్ అంటే ఏంటి..?
సాధారణంగా గోల్డ్ లోన్ అనేది ఒక రకమైన సెక్యూర్డ్ లోన్, ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బును తీసుకుంటారు. గోల్డ్ లోన్ ఇచ్చే వారు బంగారం విలువ ఆధారంగా రుణ మొత్తాన్ని డిసైడ్ చేసి డబ్బును ప్రజలకు ఇస్తారు. అంతేకాకుండా ఇతర బ్యాంకు రుణాల కంటే గోల్డ్ లోన్ చాలా సేఫ్ అని ప్రజల భావన. ఇంతకుముందు బంగారంపై నగల వ్యాపారులు లేదా వడ్డీ వ్యాపారుల నుండి డబ్బు అప్పుగా తీసుకునే వారు. ఇప్పుడు బ్యాంకులు కూడా అదే పాటించడం చాలా కామన్ గా మారిపోయింది.
గోల్డ్ లోన్ పొందాలంటే ముందుగా మీ బంగారు నగలు లేదా ఇతర వస్తువులను బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన బంగారు విలువను బట్టి బ్యాంకు వారు మీకు రుణం ఇస్తారు. అలాగే రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, మీరు డిపాజిట్ చేసిన బంగారాన్ని తిరిగి తీసుకోవచ్చు. సాధారణంగా., బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 8.25% నుంచి 18% వరకు ఉంటాయి. ఇక గోల్డ్ లోన్ తీసుకునే వారు లోన్ ను 6 నుంచి 36 నెలల వరకు తిరిగి ఇచ్చేందుకు సమయాన్ని ఉపయోగించవచ్చు.
దేశంలోని 6 అతిపెద్ద బ్యాంకుల్లో బంగారు రుణాలపై వడ్డీ రేటు వివరాలు ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 8.65%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ -9.25%
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ -11.98%
ఐసీఐసీఐ బ్యాంక్ -14.65%
యాక్సిస్ బ్యాంక్ -17%