జియో యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు 5జీ డేటా పొందాలంటే ఇది తెలుసుకోవాల్సిందే!

frame జియో యూజర్లకు బిగ్ అలర్ట్.. మీరు 5జీ డేటా పొందాలంటే ఇది తెలుసుకోవాల్సిందే!

Suma Kallamadi
రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ. జియో కంపెనీ దేశవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల పోర్ట్‌ఫోలియోలో పెద్ద మార్పు చేసింది. జియో తన చాలా రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. గతంలో అమలు చేసిన ఎన్నో రీఛార్జ్ ప్లాన్‌లను కూడా తొలగించింది. ధరను పెంచడంతో పాటు, 5జీ డేటా విషయంలో కూడా జియో పెద్ద మార్పు చేసింది. రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల పెరిగిన ధరలను జూలై 3, 2024 నుండి అమలు చేసింది. జియో తన రీఛార్జ్ ప్లాన్‌లలో అందించిన అపరిమిత 5జీ డేటాకు సంబంధించి కూడా పెద్ద అడుగు వేసింది. ఇప్పుడు జియో వినియోగదారులు కొన్ని ప్లాన్‌లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యాన్ని పొందుతారు. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో రిలయన్స్ జియో సిమ్‌ని ఉపయోగిస్తుంటే, జియో కొత్త మార్పుల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభించే అన్ని గత రీఛార్జ్ ప్లాన్‌లు ప్రస్తుతం రద్దయ్యాయి. మీరు 5జీ డేటా పొందాలంటే ఖచ్చితంగా రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
28 రోజుల వ్యాలిడిటీతో 5g డేటా అందుబాటులో ఉండే ప్లాన్‌ల వివరాలను పరిశీలిస్తే రూ. 349 ప్లాన్ ఉంది. ఇంతకుముందు దీని ధర రూ. 299గా ఉండేది. ఇప్పుడు మీరు దాని కోసం రూ. 349 వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక ఆ తర్వాత రూ. 399 ప్లాన్ కూడా ఉంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ ధర రూ. 349గా ఉండేది. దీనిని రూ.399కి పెంచారు. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ పొందొచ్చు. గతంలో రూ.399 ఉండే ప్లాన్ ధరను ప్రస్తుతం రూ.449కి పెంచారు. దీని ద్వారా ప్రతిరోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. 56 రోజుల వ్యాలిడిటీతో 5జీ ప్లాన్‌లను కూడా జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రూ.533 ఉండే ప్లాన్ ధరను రూ.629కి పెంచారు. దీని ద్వారా మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. గతంలో 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ రూ.719 ఉండేది. అది రూ.859కి పెరిగింది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: