ముఖేష్ అంబానికి సోదరీ ఉందా.. ఆమె ఆస్తి విలువ ఎంతో తెలుసా?

frame ముఖేష్ అంబానికి సోదరీ ఉందా.. ఆమె ఆస్తి విలువ ఎంతో తెలుసా?

praveen
ఇండియాలో అపర కుబేరుడిగా పేరు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు  ప్రపంచంలోని ధనవంతుల్లో టాప్ 10 లో ఆయన కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే  అయితే ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కావడం గమనార్హం. వందలు కాదు ఏకంగా లక్షల కోట్ల వ్యాపారాన్ని ప్రస్తుతం ముఖేష్ అంబానీ ముందుకు తీసుకు వెళ్తున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక జరుగుతున్న నేపథ్యంలో.. గత కొంతకాలం నుంచి అంబానీ కుటుంబం వార్తలలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 అంబానీ కుటుంబం గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన అది హాట్ టాపిక్గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కి ఏకంగా ఒక సోదరి ఉంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ సోదరి ఆస్తుల విలువ ఎంత అని తెలుసుకోవడానికి కూడా ఎంతోమంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖేష్ అంబానీ సోదరి పేరు నీనా కొటారి. కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆమె చైర్ పర్సన్ నీనా కొటారి  రిలైన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరుభాయ్ అంబానీ కుమార్తె. ముఖేష్ అంబానీ ఇద్దరు సోదరీమణులలో నీనా చిన్న సోదరి.

 ఈమె వ్యాపారవేత అయిన భద్ర శ్యామ్ కోటారిని 1986లో వివాహం చేసుకున్నారు. అయితే ఆయన 2017లో క్యాన్సర్ తో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో ఆమెకు కుమార్తె నాయనతార కొఠారి,కుమారుడు అర్జున్ కొఠారి ఉన్నారు. అయినప్పటికీ ఆమె తన ఇద్దరు పిల్లల పెంపకం తో పాటు కంపెనీ బాధ్యతలను కూడా స్వీకరించి.. ఇక బిజినెస్ లోకి ప్రవేశించారు  ఇక ఇలా కంపెనీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పాలి. ఇక ఎంతో పట్టుదలతో వ్యాపారాన్ని నిలబెట్టుకున్నారు  ఇక మరికొన్ని సంస్థలు నెలకొల్పి అగ్రస్థానానికి చేరుకున్నారు  అయితే నీనా కొటారి నికర సంపద విలువ 52.4 కోట్లకు పైగా ఉంది  దీంతోపాటు ఆమె రెండు పబ్లిక్ ట్రేడ్ చేయబడిన షేర్లు కూడా కలిగి ఉన్నారు. కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ 435 కోట్ల రూపాయలు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: