కారు కొనాలి అనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన ఆ రెండు క్రేజీ కంపెనీల కారు ధరలు..!

frame కారు కొనాలి అనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన ఆ రెండు క్రేజీ కంపెనీల కారు ధరలు..!

Pulgam Srinivas
ఒకప్పుడు కారు అనేది చాలా పెద్ద విషయం. కేవలం బాగా డబ్బులు ఉన్న వ్యక్తులు మాత్రమే కార్లు కొనాలి అని ఆలోచన కలిగి ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మధ్య తరగతి ప్రజలు కూడా తక్కువ ధరలో ఏదైనా మంచి ఫ్యూచర్స్ ఉన్న ఒక కారును కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం సమాజంలో గుర్తింపు కోసం కావచ్చు లేదా పరిస్థితుల ప్రభావం కావచ్చు.

ఒకప్పుడు రవాణా మార్గాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. దాని వల్ల ఒక కారును కొనుగోలు చేసిన రోడ్డు మార్గం సరిగా లేకపోవడం వల్ల కారు తొందరగా పాడైపోతుంది అనే ఉద్దేశంతో కూడా కొంత మంది మారుమూల ప్రాంత ప్రజలు కారులపై ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాలలో రోడ్డు వసతులు కూడా బాగు మెరుగు కావడంతో మధ్య తరగతి ప్రజలు కూడా కారులను కొనాలి అనుకుంటున్నారు. అందులో భాగంగా ఏదైనా మంచి కంపెనీ కి సంబంధించిన కార్లు తక్కువ ధరలు వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు.

అలాంటి వారికి టాటా , మహేంద్ర కంపెనీ లు అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చాయి. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఇండియా లో అత్యంత క్రేజ్ కలిగిన కంపెనీలు అయినటువంటి టాటా మరియు మహేంద్ర కంపెనీలు కొన్ని మోడళ్ళ కార్లపై ఏకంగా 8 శాతం వరకు ధరలను తగ్గించాయి. మహేంద్ర XUV 700  AX 7 డీజిల్ కారు ధర ఏకంగా 23.69 లక్షల నుండి 21.59 లక్షలకు దిగింది. అలాగే టాటా హరియర్ ప్యూర్ + కారు ధర 1.20 తగ్గింది. ఈ రెండు కంపెనీలు తమ వద్ద అమ్ముడు పోని కార్ల నిల్వలు భారీగా పెరగడంతో ఈ భారీ డిస్కౌంట్ లను ఈ కంపెనీ లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: