నిరుపేద కుటుంబంలో పుట్టి.. ప్రపంచాన్నే శాసిస్తున్న ముఖేష్ అంబానీ..!

frame నిరుపేద కుటుంబంలో పుట్టి.. ప్రపంచాన్నే శాసిస్తున్న ముఖేష్ అంబానీ..!

Divya
ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. అయితే ముఖేష్ అంబానీ పుట్టుకతోనే ధనవంతుడు ఏమీ కాదు.. ఈయన తండ్రి ధీరూభాయ్ అంబానీ, తల్లి కోకిలాబేన్ అంబానీ.. అంబానీ తల్లిదండ్రులు బ్రతుకుతెరువు కోసం యెమన్ అనే ప్రాంతానికి వెళ్లగా..ఆ ప్రాంతంలో ముఖేష్ అంబానీ జన్మించారు .. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయ్ మొదట ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేసేవారట.. ముఖేష్ అంబానీ పుట్టిన తర్వాత.. అందరూ ఇండియాకి తిరిగి వచ్చారట. అలా మొదట ముంబైలో ఒక చిన్న అపార్ట్మెంట్లో జీవించే వారట.. కేవలం 500 రూపాయలతోనే మొదట వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా అంచలంచెలుగా ఎదిగారట.

ధీరూభాయ్ అంబానీ తన కలలు నెరవేర్చడం కోసం ఎంతో కష్టపడ్డారట. ఎప్పుడూ కూడా అన్నిటికంటే భిన్నంగానే ఆలోచించేవారు.. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీ పేరుతో మొదట వస్త్ర వ్యాపారాన్ని సైతం మొదలుపెట్టారట.. ఇప్పుడు ఇదే ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కంపెనీగా పేరు సంపాదించింది. ముంబై కి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ చిన్న కుమారుడైన అనిల్ అంబానీ జన్మించారట.1980 లో ముఖేష్ అంబానీ స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. చదువుకునే సమయాలలో కూడా విద్యార్థుల మధ్య కూర్చొని ఎక్కువగా చదివేవారట.

ఆ తర్వాత ధీరూ భాయ్ అంబానీ తన సొంత కంపెనీలోని ఉద్యోగం చేసేవారట.. అలా తను తీసుకున్న నిర్ణయాలు కంపెనీని ఇప్పుడు ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా చేశాయి.. ముఖ్యంగా ముఖేష్ అంబానీ రాబోయే పదేళ్ల ముందే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాలను అంచనా వేసుకొని అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు సైతం తీసుకునే వారట. అలాంటి నిర్ణయాల వల్లే ఇప్పుడు కోట్లకు ఆయన కంపెనీలు పడగలెత్తాయని కూడా చెప్పవచ్చు. 2002లో ముఖేష్ అంబానీ తండ్రి మరణించారు ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య కాస్త గొడవలు రావడంతో 2006లో ఆస్తి పంపకాలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన ఆస్తులను రోజురోజుకి పెంచుకుంటూ పోగా అనిల్ అంబానీ మాత్రం కంపెనీలతో నష్టాలు ఏర్పడి విఫలమయ్యారు.

ముఖేష్ అంబానీ 2016లో రిలయన్స్ జియో టెలీ కమ్యూనికేషన్ సంస్థను ప్రారంభించి అందరికీ కూడా అన్ని ప్లాన్లు అందుబాటులో ఉంచేలా చేశారు. టెక్నాలజీ అంటే ఇలా ఉండాలి అని 5 G నెట్వర్క్ ని ప్రవేశపెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ముఖేష్ అంబానీ భవనం పేరు  ఆంటిలియా.. ఈ భవనం ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.. సుమారుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 8,350 కోట్ల రూపాయలు.. ఈ భవనం 27 అంతస్తులు కలదు. ఇందులో 600 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉంటారట.

ముఖేష్ అంబానీ చదువు కంటే ఆటలలో మరింత ఎక్కువగా ఉండేవారట.. హాకీ, ఫుట్ బాల్, అనేక గేమ్ లలో పాల్గొనే వారట.  తన సొంత ఊరికి వెళితే అక్కడ 10 నుంచి 15 రోజులు ఉండేవారట.

ముఖేష్ అంబానికి ఎంత డబ్బులు ఉన్నా కూడా సాదాసీదా గానే జీవించడానికి ఇష్టపడేవారు.. తను తరచూ తెలుపు, ముదురు రంగు షర్టులను మాత్రమే ధరిస్తూ ఉండేవారు. ముఖేష్ అంబానీ జీవితం బయట కూడా సాదాసీదా గానే ఉంటుంది. ఎక్కువగా గుజరాతి ఆహారాన్ని ఇష్టపడతారు.. శాఖాహార జీవనశైలిగా పేరుపొందారు. మద్యం కూడా సేవించరట.. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేచి తన కార్యక్రమాలను తానే చూసుకుంటారట. అలాగే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్రెడిట్ కార్డులు లేవు.. దేనికైనా ఆయన సొంతంగా డబ్బులు చెల్లించి తీసుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: