అమెజాన్ ప్రైమ్ డే సేల్: స్మార్ట్ ఫోన్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్?

frame అమెజాన్ ప్రైమ్ డే సేల్: స్మార్ట్ ఫోన్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్?

Purushottham Vinay

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో ఆఫర్స్‌ అందించనున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్ జులై 20,21వ తేదీల్లో అందుబాటులోకి రానుంది.ఈ ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌ శుక్రవారం నాడు అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఇంకా అన్ని రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని సూపర్ స్మార్ట్‌ ఫోన్‌లు అయితే అమ్మకానికి రానున్నాయి.ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా ఎన్నో డిస్కౌంట్స్‌ లభించయనున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన డెబిట్‌ ఇంకా క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ లభిస్తోంది. వీటికి అదనంగా అమెజాన్‌ కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్ అనేది లభిస్తోంది. ఓఎల్‌ఈడీ స్క్రీన్‌, యాపిల్‌ బయోనిక్‌ ఏ15 చిప్‌తో ఉన్న ఈ ఫోన్‌ ప్రస్తుత ధర మొత్తం రూ. 52 వేలు ఉండగా. సేల్‌లో భాగంగా ఇది కేవలం రూ. 48,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో వెయ్యి రూపాయల కూడా డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 47,799కి పొందొచ్చు. ఇదిలా ఉంటే అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌4, శాంసంగ్‌ ఎం35, మోటోరొలా రేజర్‌ 50 అల్ట్రా, హానర్‌ 200 సిరీస్‌ ఇంకా లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్స్‌ తొలిసారి సేల్‌ ప్రారంభం కానున్నాయి.అమెజాన్‌ సేల్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి చెందిన వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.64,999 కాగా.. సేల్‌లో భాగంగా బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని దీన్ని రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు.ఇంకా అలాగే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 అల్ట్రా ఫోన్‌ ధర రూ.74,999 మరియు ఐకూ నియో 9 ప్రో ధర రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 ని రూ.21,999 ఇంకా రెడ్‌మీ 13సి రూ.9499కే సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: