ఒకప్పుడు పాలు అమ్మాడు.. ఇప్పుడు 3000 కోట్ల ఆస్తి ?
అయితే బాల్యం నుండి వేలుమణి దృఢంగా ఉండడంతో పాటు ఎంతో కష్టపడి ప్రాథమిక విద్యను అప్పనాయికెన్ పట్టి, పూదూర్.. ఆ తరువాత మద్రాస్ రామకృష్ణ మిషన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1955లో థైరాయిడ్ బయో కెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. అయితే థైరోకేర్ ప్రారంభించడానికి ముందు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాల పాటు పనిచేశారు మేలుమణి. అంతేకాదు ఈయన న్యూక్లియర్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఎండిగా కూడా పనిచేయడం గమనార్హం.
ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను తెలుసుకోవడం ప్రారంభించారు వేలుమణి. అనంతరం 1996వ సంవత్సరంలో సొంతంగా థైరాయిడ్ టెస్టింగ్ లాబరేటరీని ఏర్పాటు చేశారు. అయితే డయాగ్నస్టిల్ లాబరేటరీలో ఫ్రాంచైజ్ మోడల్ ను మొదలుపెట్టగా.. ఆయనకు ఏకంగా 1400 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
ఇప్పుడు ఈ థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్టలైజేషన్ విలువ రూ. 3300 కోట్లుగా ఉంది. అలా బాల్యం నుండి ఎన్నో కష్టాలను చూసిన వేలుమణి.. జీవితంలో సక్సెస్ కావాలనే ఆలోచనతో వేలకోట్ల సంపదను సృష్టించారు. ప్రస్తుతం వేలుమణి తన కొడుకు మరియు కుమార్తెతో కలిసి నవీ ముంబైలోని థైరోకేర్ యొక్క ప్రధాన కార్యాలయంలో ఉన్న కంపెనీ క్వార్టర్స్ లో నివసిస్తున్నారు. ఈయన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.