ఎప్పుడైనా వెల్లుల్లి స్కామ్ గురించి విన్నారా.. సిమెంట్‌తో చేస్తారట..?

frame ఎప్పుడైనా వెల్లుల్లి స్కామ్ గురించి విన్నారా.. సిమెంట్‌తో చేస్తారట..?

praveen
ఇటీవల కాలంలో కొంతమంది వ్యాపారులు ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సిమెంట్‌తో వెల్లుల్లిని తయారు చేసి, అసలు వెల్లుల్లి అని చెప్పి మనకు అమ్ముతున్నారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి పెద్ద కలకలం రేపింది. ఈ వెల్లుల్లిని చూపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెల్లుల్లి ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, నిజమైన వెల్లుల్లి అని చెప్పి సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లిని అమ్ముతున్నారు. అకోలాలోని బజోరియా నగర్‌లో నివసించే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ భార్య ద్వారా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక వీధి వ్యాపారి నకిలీ వెల్లుల్లి ఆమెకు అమ్మాడు.
పాటిల్ భార్య తమ ఇంటి ముందు వీధి వ్యాపారి వద్ద నుంచి 250 గ్రాముల వెల్లుల్లి కొన్నారు. కానీ, ఆ వెల్లుల్లి రెబ్బలను వేరు చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి వేరు కాకపోవడంతో ఈ మోసం బయటపడింది. ఆ వెల్లుల్లి అసలు వెల్లుల్లి కాదు, కృత్రిమంగా తయారు చేసినవి. అందుకే వెల్లుల్లి రెబ్బలు విడిపోలేదు దానికి బదులుగా సిమెంట్ అనేది రాలి పడింది. అది నిజమైన వెల్లుల్లి కాదు, సిమెంట్‌తో తయారు చేసి, దాని మీద తెల్లటి రంగు పూత వేసి నిజమైన వెల్లుల్లిలా కనిపించేలా చేసారని దగ్గరగా పరిశీలించగా తేలింది. ఈ సంఘటనపై పాటిల్ మాట్లాడుతూ, "ఆ వీధి వ్యాపారి నిజమైన వెల్లుల్లి అని చెప్పి నకిలీ వెల్లుల్లిని అమ్ముతున్నాడు. దీని వల్ల వినియోగదారులు మోసపోతున్నారు, అంతేకాకుండా ప్రజారోగ్యానికి కూడా ఇది ప్రమాదకరం" అని అన్నారు.
జిల్లాలో, నిజమైన వెల్లుల్లికి బదులుగా సిమెంట్ కలిపిన నకిలీ వెల్లుల్లిని కలిపి అమ్ముతున్నారు. ఇది చాలా చెడ్డ విషయం. ఎందుకంటే, నిజమైన వెల్లుల్లిలానే కనిపించడం వల్ల, కొనుగోలు చేసేవారు నకిలీ వెల్లుల్లిని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. మరోవైపు, మధ్యప్రదేశ్ హైకోర్టు వెల్లుల్లిని కూరగాయ అని తీర్పు ఇచ్చింది. దీంతో, వెల్లుల్లిని కూరగాయల మార్కెట్‌లోనూ, మసాలా దినుసుల మార్కెట్‌లోనూ అమ్మవచ్చు అని నిర్ణయించారు. వెల్లుల్లి కూరగాయనా? లేక మసాలా దినుసా? అనే విషయంపై చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉంది. హైకోర్టు తీర్పుతో వెల్లుల్లిని మసాలా దినుసుగా వర్గీకరిస్తూనే కూరగాయగా పరిగణించేందుకు అనుమతిస్తే రైతులకు, వ్యాపారులకు మేలు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: