రూ. 2 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. దీని ఫీచర్లు తెలిస్తే మతిపోతుంది..

frame రూ. 2 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. దీని ఫీచర్లు తెలిస్తే మతిపోతుంది..

praveen
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అదీ ఎలక్ట్రిక్ కారు? కానీ ఖర్చు ఎక్కువ అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్! చిన్న బైక్ లాంటి 'వింగ్స్ ఈవీ రాబిన్' అనే ఈవీ కారు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కావడానికి సిద్ధమయ్యింది. ఈ కారు చాలా చిన్నదిగా ఉండి, నగరంలో తిరగడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.2 లక్షలు మాత్రమే. ఈ కారును మన దేశంలో 2025, మొదటి మూడు నెలల్లోనే లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 5,000 అడ్వాన్స్ చెల్లించి ఈ కారణం ఇప్పుడే బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
ఇండోర్‌లో నివసించే తండ్రీ కొడుకులు కలిసి స్థాపించిన 'వింగ్స్ ఈవీ' అనే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారు పేరు 'రాబిన్'. ఈ కారును 2025 ఏప్రిల్‌లో బెంగళూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. బెంగళూరు నగరంలో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి ఎక్కువగా ఉండటం, అలాగే ఇది టెక్నాలజీకి సంబంధించిన నగరం కాబట్టి ఈ కారును బెంగళూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు హైదరాబాద్, చెన్నై, పూణె లాంటి ఇతర పెద్ద నగరాలలోనూ 2025లోనే అందుబాటులోకి తీసుకురావాలని 'వింగ్స్ ఈవీ' కంపెనీ నిర్ణయించింది.
ఈ కంపెనీ చెప్పిన ప్రకారం నెమ్మదిగా కారును విక్రయించడం ద్వారా, కారును కొనుగోలు చేసే వారి అభిప్రాయాలను తెలుసుకొని, కారు తయారీ, అమ్మకాల విధానాలను మెరుగుపరచుకోవాలని కంపెనీ భావిస్తోంది. వింగ్స్ ఈవీ రాబిన్ కారు మామూలు కార్లలా కాదు. ఇది చాలా చిన్న కారులా ఉంటుంది, కానీ బైక్‌లా చాలా తేలికగా నడపవచ్చు. ఈ కారును మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. మొదటి రకం కారు: ఇది చాలా సాధారణ రకం. దీని ధర రూ.2 లక్షలు. ఈ కారు ఒకసారి చార్జ్ చేస్తే 65 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో ఎయిర్ కండిషనర్ ఉండదు.రెండవ రకం కారు: దీని ధర రూ. 2.5 లక్షలు. ఇందులో ఫ్యాన్ ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
మూడవ రకం కారు: ఇది అత్యంత ఉన్నతమైన రకం. దీని ధర రూ.3 లక్షలు. ఇందులో ఎయిర్ కండిషనర్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇది రెండవ రకం కారులాగే ఒకసారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రాబిన్ కారులో ఉండే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, దీనిలో ఉండే ఇంజిన్‌ను నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విధానాన్ని ఫైటర్ జెట్లు, ఫార్ములా వన్ కార్ల నుంచి తీసుకున్నారు. సాధారణంగా కార్లలో ఉండే మెకానిక్స్ కు బదులుగా, ఇందులో ఎలక్ట్రానిక్స్ ద్వారా కారును నడిపిస్తారు. దీని వల్ల కారును చాలా సులభంగా, స్థిరంగా నడిపించవచ్చు. ఈ కారులో రెండు బలమైన ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ రెండు మోటార్లు కలిసి కారును చాలా వేగంగా నడిపించగలవు. ఈ కారులో ఉండే బ్యాటరీ చాలా సన్నగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని బ్యాటరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: