మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

frame మరో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

Suma Kallamadi
ఈమధ్యనే రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడంతో యూజర్లు ఆందోళన చెందారు. టెలికాం సంస్థల మధ్య ఇప్పుడు గట్టి పోటీ ఉంది. అందుకే జియో వచ్చిన తర్వాత ఛార్జీలు భారీగానే తగ్గినా ఆ తర్వాత ఒక్కసారిగా టారిఫ్ ఛార్జీలు పెరుగుతూ వచ్చాయి. జియోతో ప్రారంభమైన ఈ ఛార్జీల పెంపు ఆ తర్వాత క్రమంగా అన్ని టెలికాం సంస్థలకు వ్యాపించింది. సరిగ్గా ఈ టైంలోనే భారత ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ వస్తోంది.
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన సరికొత్త ప్లాన్లతో యూజర్లు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నారు. రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌తో అద్భుతమైన సేవలన్నీ అందిస్తూ వస్తోంది. దీంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం అందుతోందని చెప్పాలి. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4జీ సేవల్ని లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాాగా మరో అట్రాక్టివ్ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఎక్కువ డేటాతో పాటు ఎక్కువ కాలం రీఛార్జ్ పొందే బెస్ట్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
రూ.2999 రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ యూజర్లకు లభిస్తోంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఇక ఏడాదంతా అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, అలాగే రోమింగ్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. రోజూ 3జీబీ వరకూ డేటా పొందడమే కాకుండా ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పంపవచ్చు. ఇలాంటి అదిరిపోయే బెనిఫిట్స్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ ఎందులోనూ లేదు. ఇతర టెలికాం సంస్థల్లోని రీఛార్జ్ ప్లాన్లు చూస్తే..84 రోజులకు మాత్రమే అలాంటి ఆఫర్లు ఉన్నాయి. జియోలో అయితే రూ.1799, ఎయిర్‌టెల్‌లో అయితే రూ.1798 ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన సరికొత్త ప్లాన్‌కు మిగిలిన నెట్‌వర్క్ సంస్థలు హడలిపోతున్నాయి. చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్‌ తీసుకొస్తున్న సరికొత్త ప్లాన్లను చూసి అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. దీంతో మిగిలిన టెలికాం సంస్థలు గుండెలు బాదుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: