ఆ బ్యాంకుకు రూ.2 కోట్లు ఫైన్.. షాకిచ్చిన ఆర్బీఐ

Suma Kallamadi
బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ రూల్స్ పాటించని వారికి గట్టి షాకే తగులుతోంది. అలా నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ కూడా కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఆర్బీఐ ఓ బ్యాంకుకు రూ.2 కోట్ల జరిమానాను విధించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూసీఓపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. బ్యాకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించింది. యూసీవో బ్యాంకుకు రూ.2,68,30,000 ఫైన్ వేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
2024 ఆగస్టు 26న జారీ చేసిన ఆర్డర్ ప్రకారంగా యూసీవో బ్యాంకుపై రెండు కోట్ల రూపాయలకు పైనే జరిమానా విధించడం బ్యాంకింగ్ రంగంలో అలజడి రేపుతోంది. ఆ బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 26ఏ రూల్స్‌ను పాటించలేదు. అడ్వాన్సులపై వడ్డీరేట్లు, బ్యాంక్ కరెంట్ అకౌంట్స్, డిపాజిట్స్‌పై వడ్డీ రేట్లలో మోసాలు చేయడం వల్ల చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ చెప్పిన రూల్స్ పాటించనందుకు ఆ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులు అనేవి ప్రజలను సంరక్షించేవిగా ఉండాలని, మోసాలకు పాల్పడకూడదని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు నష్టపోకుండా బ్యాంకింగ్ రంగంలో మోసాలు జరగకుండా ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చింది. అయితే యూసీవో బ్యాంకు ఆ నిబంధనలను పాటించలేదు.
ముందుగా బ్యాంకు పర్యవేక్షణపై విచారణ చేశాక యూసీవో బ్యాంకుకు ఆర్బీఐ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత మోసాలు బయటపడటంతో చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. నోటీసులు ఇచ్చిన తర్వాత యూసీవో బ్యాంకుకు పెనాల్టీ వేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. యూసీవో బ్యాంకు రుణాలను బెంచ్ మార్క్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఆ బ్యాంకుపై పెనాల్టీ వేసినట్లుగా చెప్పుకొచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఇటువంటివి జరగడం మామూలే. అయితే బ్యాంకులు మాత్రం ఆర్బీఐ రూల్స్ పాటించడంలో కొన్ని తప్పులు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ మోసాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో ఆ బ్యాంకులను కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: