భారతదేశంలో అత్యంత గొప్ప వ్యాపారవేత్తలలో ఒకరు అయినటువంటి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఎన్నో వ్యాపారాలు చేసి అద్భుతమైన స్థాయిలో పేరు ప్రతిష్టలను పొందారు . ఇకపోతే రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు , వ్యాపారవేత్త ముకేష్ అంబానీ భాగస్వామి నీతా అంబానీ తన 61 పుట్టిన రోజును తాజాగా జరుపుకుంటున్నారు. ఇక ఈమె ముఖేష్ అంబానీ మధ్య ప్రేమ ఎలా చిగురించింది. అసలు వీరిద్దరి మధ్య వివాహం జరిగే ముందు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ తండ్రి అయినటువంటి ధీరుబాయ్ అంబానీ మొదటగా నీతా ను చూసి ఆమె హుందాతనం , ప్రతిభను గుర్తించి ఆమె తన ఇంటికి కోడలుగా వస్తే బాగుంటుంది అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఒకానొక సందర్భంలో నీతా భరతనాట్యం చేస్తూ ఉండగా దానిని ధీరుబాయ్ అది చూసి ఇంత గొప్ప ప్రతిభావంతురాలు తన కుమారుడు అయినటువంటి ముఖేష్ అంబానీ కి భార్య అయితే ఎంతో బాగుంటుంది అని అనుకున్నారట. దానితో వారిద్దరికీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వారిద్దరి మధ్య స్నేహం చిగురించేలా చేశారట.
ఇకపోతే కొన్ని వార్తల ప్రకారం ముఖేష్ అంబానీ ఒక రోజు నీతా తో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా సిగ్నల్ పడడంతో వారు కారు ఆపరట. ఇక అలాంటి సమయంలో అంబానీ , నీతా వైపు చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడట. ఆమె దెబ్బకు షాక్ అయ్యిందట. ఇక ఆ తర్వాత ఆమె సమాధానం చెప్పకపోవడంతో నువ్వు సమాధానం చెప్పే వరకు కారును ఇక్కడ నుండి కదపను అని అన్నాడట. ఇక ఆమె దానితో నీతో పెళ్లి ఇష్టం అని చెప్పిందట. ఇలా వారి ప్రేమ ప్రయాణం సాగినట్లు తెలుస్తుంది.