రోల్స్ రాయిస్ కొంటే ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?

praveen
రోల్స్ రాయిస్ అంటే లక్సరీ కార్లకు పెట్టింది పేరు. చాలామంది బడాబాబులు తమ ఉనికిని ప్రదర్శించుకోవడానికే ఈ బ్రాండ్ కార్లను కొంటూ ఉంటారు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. రోల్స్ రాయిస్ లిమిటెడ్ అనేది బ్రిటిష్ లగ్జరీ ఆటోమొబైల్ తయారీ సంస్థ. ఇది 2003 నుండి బిఎమ్డబ్ల్యూ ఏజీకి పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. సంస్థ యొక్క పరిపాలనా మరియు ఉత్పత్తి ప్రధాన కార్యాలయాలు యూకేలోని ఇంగ్లాండ్లో ఉన్న వెస్ట్ సస్సెక్స్లోని గుడ్వుడ్లోని 42 ఎకరాల (17 హెక్టార్లు)లో వ్యాపించి ఉన్నాయి. 1906 నుండి 2003 వరకు, రోల్స్ రాయిస్ లిమిటెడ్ మరియు రోల్స్ రాయిస్ మోటార్స్ ద్వారా రోల్స్ రాయిస్ బ్రాండ్ క్రింద మోటారు కార్లు తయారు చేయబడ్డాయి. అయితే బిఎమ్డబ్ల్యూ ఏజి యొక్క రోల్స్-రాయిస్ మోటార్ కార్స్ అనుబంధ సంస్థకు 2003కి ముందు ఉత్పత్తి చేయబడిన రోల్స్-రాయిస్-బ్రాండెడ్ వాహనాలతో ప్రత్యక్ష సంబంధం లేదు.
బహుశా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన కార్లలో రోల్స్ రాయిస్ బ్రాండు పేరు ప్రధమంగా వినబడుతూ ఉంటుంది. కంపెనీ వాహనాల శ్రేణిలో ఫాంటమ్, 2003లో మొదటిసారిగా అందించిన నాలుగు-డోర్ల సెలూన్తో పాటు దాని పొడిగించిన వీల్బేస్ రెండు-డోర్ల కూపే మరియు కన్వర్టిబుల్ వేరియంట్లు ఇపుడు విరివిగా అమ్ముడు పోతున్నాయి. ఈ లిస్టులో చిన్న ఘోస్ట్ నాలుగు-డోర్ల సెలూన్; వ్రైత్ రెండు-డోర్ల కూపే; డాన్ కన్వర్టిబుల్; కుల్లినాన్ SUV, మరియు 2023 స్పెక్టర్, మొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోల్స్-R మొదలైనవి ఉన్నాయి.
ఇక రోల్స్ రాయిస్ కారు కలినన్ చౌకైన మోడల్‌ ధరే దాదాపుగా రూ. 6.95 కోట్ల నుండి ప్రారంభమవుతుంది అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. అయితే అత్యంత ఖరీదైన మోడల్ ఫాంటమ్ ధర మాత్రం రూ. 9.50 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. కాగా రోల్స్ రాయిస్ ఇండియాలో 3 కార్ మోడళ్లను అందిస్తుంది. ఇందులో ఎస్‍యూవీ'లు కేటగిరీలో 1 కారు, సెడాన్స్ కేటగిరీలో 1 కారు, కూపే కేటగిరీలో 1 కారు ఉన్నాయి.
ఇండియాలో (నవంబర్ 2024) రోల్స్ రాయిస్ కార్లు ధరల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే... రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర Rs. 9.50 కోట్లు, రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధర Rs. 7.50 కోట్లు కాగా రోల్స్ రాయిస్ కలినన్ ధర Rs. 6.95 కోట్లుగా ఉంది. ఇక ఔత్సాహికులైన వారి వీటిని EMI రూపంలో కూడా సొంతం చేసుకోవచ్చు. అది బ్రాండును బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ కావాలనుకునేవారు ముందే డౌన్ పేమెంట్ కింద ₹13,42,245 చెల్లించవలసి ఉంటుంది. 1,55,93,950 వడ్డీతో కలిపి మొత్తం లోన్ ధర 8,05,34,700 గా ఉంది. ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ ఎక్స్-షోరూమ్ ధర అయితే 75,000,140గా ఉంది. ఇక ఆర్టీఓ 2,919,471, ఇన్సూరెన్స్ 50,140 అనేవి తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: