మార్కెట్ లోకి రాందేవ్ బాబా నూడుల్స్ హల్ చల్..!!

Edari Rama Krishna
యోగాతో యావత్ భారత దేశాన్ని మంత్ర ముగ్ధులను చేస్తూ ప్రత్యేకత చాటుకున్న యోగ గురు రాందేవ్ బాబా ఇప్పటికే ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ రకాల ప్రోడెక్ట్స్ మార్కెలోకి తీసుకు వచ్చారు. తాజాగా మార్కెట్ లోకి  ‘పతంజలి’ న్యూడిల్స్ ను విడుదల చేశారు. 70 గ్రాముల న్యూడిల్స్ ప్యాకెట్ ధర రూ. 15 మాత్రమే. ఈ నూడుల్స్‌ను దేశ వ్యాప్తంగా మూడు లక్షల దుకాణాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

వచ్చే ఏడాదిలో నూడుల్స్ మాన్యు ఫాక్చరింగ్ ప్లాంట్లను ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2015 చివరి నాటికి చైల్డ్ కేర్, కాస్మొటిక్స్ ఉత్పత్తులను మార్కెట్ లోకి ప్రవేశపెడతామని చెప్పారు. 2014-15లో తమ సంస్థ అమ్మకాలు రూ. 2,007 కోట్లు అని, త్వరలోనే రూ.5 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ ఏడాది చివరి నాటికి చైల్డ్ కేర్, కాస్మెటిక్స్ ఉత్పత్తులను మార్కెట్ లోకి ప్రవేశపెడతాం.

నూడుల్స్ తింటున్న రాందేవ్ బాబా


చైల్డ్ కేర్ ఉత్పత్తులను ‘శిశు కేర్’ బ్రాండ్ పేరిట, కాస్మెటిక్స్ ఉత్పత్తులను ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట, హెల్త్ సప్లిమెంట్ పౌడర్ ను ‘పవర్ వీటా’ బ్రాండ్ పేరిట డిసెంబర్ చివరి నాటికి విడుదల చేస్తాం. ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ పై రక రకాల ప్రచారాలు జరిగాయి..అవి తింటే అనారోగ్యానికి గురైతారని ఆ మద్య వార్తలు వచ్చాయి...ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ తమ నూడుల్స్‌లో సీసం, మోనో సోడియం, గ్లూటామెట్ వంటి ప్రమాదకర పదార్థాలు లేవని ప్రకటించారు.  ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్‌ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. 

రాందేవ్ బాబా ట్విట్ : 

With nationwide launch of Most awaited #PatanjaliAttaNoodles on 16 Nov, New trend of healthier instant food will begin @yogrishiramdev

— tijarawala sk (@tijarawala) November 14, 2015 Patanjali launches noodles, plans 6 manufacturing units - The Times of India https://t.co/azCO1juWbU via @timesofindia @yogrishiramdev

— tijarawala sk (@tijarawala) November 16, 2015 Maggi might be back, but Baba Ramdev cooks up Patanjali noodles on the side https://t.co/ciKYIoH0LU via @sharethis @yogrishiramdev

— tijarawala sk (@tijarawala) November 17, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: