అమెరికా ఎఫెక్ట్‌.. భారత స్టాక్ మార్కెట్ కుదేలు..!

Edari Rama Krishna
అమెరికా మార్కెట్ల భారీ పతనం ప్రభావంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. 2011 తర్వాత అమెరికా మార్కెట్ వాల్‌స్ట్రీట్ భారీ పతనం భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీసింది.  దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా కుదేలైంది.  అటు నిఫ్టీ సైతం 350 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది.  సెకన్ల వ్యవధిలోనే 5లక్షల 40 వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద  హరించుకుపోయింది. 2015 తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు ఇంత దిగువకు రావడం ఇదే మొదటి సారి.

ఈ ఉదయం ప్రీ ఓపెన్ సెషన్‌లో 700 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్, ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇప్పటికే పన్ను ఆందోళనలతో భారీగా నష్టపోతున్న సూచీలు, అమెరికా మార్కెట్ల ప్రభావం కారణంగా మరింత నష్టపోయాయి.  మరోవైపు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా పాలసీ కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపుతోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరగడంతో, కీలక వడ్డీరేటు అయిన రెపోను పెంచే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్, కేవలం ఐదు నిమిషాల్లో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు నష్టపోయి 33,715.69 పాయింట్లకు చేరుకుంది. సోమవారం రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, ఈ ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరుకోవడం గమనార్హం.దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది.

అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి.అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది. అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. వాల్‌స్ట్రీట్‌ ఎఫెక్ట్‌ తో ఆసియన్‌ మార్కెట్లు భారీగా పడిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: