భర్త చనిపోయాడు.. కానీ చివరికి తమ్ముడే అలా చేశాడు?
తుముకూరు సమీపంలో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య చేసింది ఎవరో కాదు చిన్నాన్న కుమారుడు మంజునాథ్ అన్న విషయం విచారణలో బయట పడింది. మహిళను హత్య చేసిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. సుధా అనే మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఇటీవలే ఈ నెల 13వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందటే భర్త చనిపోయాడు. అయితే తల్లి ఇంటికి రాకపోవడంతో వెంటనే పిల్లలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని రహదారి పక్కన సుధా మృతదేహం లభ్యమైంది. ఇంకోవైపు శివమొగ్గ లాడ్జీలో మంజునాథ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసు విచారణలో చిక్కుముడి వీడింది సుధా మంజునాథ స్థలం జిల్లాలోని చిక్కనాయకంహళ్లి అని.. వీరికి డబ్బులు ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడదామని మంజునాథ్ కార్లో తీసుకెళ్లి హత్య చేసినట్లు మంజునాథ్ వద్ద డెత్ నోట్ దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..