వంటా వార్పు: టేస్టీ టేస్టీ `రొయ్యల మంచూరియా` ఎప్పుడైనా ట్రై చేశారా..?
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు- పావుకేజి
మైదా- ఒక టేబుల్ స్పూను
చిల్లీ సాస్- ఒక టీ స్పూన్
సోయా సాస్- ఒక టీ స్పూన్
మిరియాల పొడి- అర టీ స్పూన్
క్యాప్సికం- ఒకటి
ఉల్లితరుగు- ఒక కప్పు
అల్లం, వెలుల్లి తరుగు- ఒక టీ స్పూన్
వెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్
కార్న్‌ఫ్లోర్- మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
అజినమోటో- చిటికెడు
టమోటా సాస్- ఒక టీ స్పూన్
వెనిగర్- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా రొయ్యలను మైదా, రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, సోయా సాస్, ఉప్పులతో కలిపి గంటసేపు పక్కనుంచి నూనెలో దోరగా వేగించాలి.
మరోవైపు పాన్‌లో కొద్ది నూనె వేసి.. వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనిగర్, ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు వేగించుకున్న రొయ్యలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి కరిగించిన కార్న్‌ఫ్లోర్ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ రొయ్యల మంచూరియా రెడీ.