మిరియాల అన్నం.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Durga Writes

ప్రస్తుతం ప్రపంచానికి వైరస్ చుట్టుకుపోయింది.. ఎవరు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఈ సమయంలో కొంచం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎంతోమంచిది. అలాంటి ఆహారమే ఈ మిరియాల అన్నం. అది ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే చేసుకొని తినండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, 

 

అల్లం-ఒక టీస్పూను, 

 

కాప్సికం ముక్కలు- ఒక అరకప్పు, 

 

కరివేపాకు - గుప్పెడు, 

 

ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, 

 

కారం - చిటికెడు, 

 

ఉప్పు - అర టీస్పూను, 

 

వండిన అన్నం - ఒక కప్పు, 

 

నల్ల మిరియాలపొడి - ముప్పావు టీస్పూను, 

 

గరం మసాలా - పావు టీస్పూను,

 

కొత్తిమీర-గుప్పెడు, 

 

నిమ్మరసం - ఒక టీ స్పూను.
 

తయారీ విధానం... 
 

ఒక పాన్ లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయినా తర్వాత అందులో పైన చెప్పిన కొలతల ప్రకారం అల్లం, వెల్లుల్లి ముక్కలు, కాప్సికం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా వేగించాలి. అందులో ఉడికిన అన్నాన్ని, ముప్పావు టీస్పూను నల్లమిరియాల పొడిని వేసి బాగా కలపాలి. ఆతర్వాత గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసాలను వేసి కలపాలి. అంతే మిరియాల అన్నం రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: