ఈవెనింగ్ స్నాక్స్.. సొరకాయ గారెలు సూపరు!
లాక్ డౌన్ ఎఫెక్ట్.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. ఇంకా ఇంట్లో ఉంటే తింటూనే ఉంటారు.. అలా తినే సమయంలో సాయింత్రం 4 గంటలకు ఇంట్లోనే సొరకాయ గారెలు చేసి పెడితే.. పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.. అయితే ఈ సూపర్ సొరకాయ గారెలు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు..
సొరకాయ - ఒకటి చిన్నది,
మినప్పప్పు - రెండు కప్పులు,
పచ్చిమిర్చి - రెండు,
జీలకర్ర - చెంచా,
కరివేపాకు - రెండు రెబ్బలు,
అల్లం ముక్క - చిన్నది,
నూనె - వేయించడానికి సరిపడా,
ఉప్పు- తగినంత.
తయారీ విధానం..
మినప్పప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి మిక్సీకి వేసి గారెల పిండిలా తయారీ చెయ్యాలి. ఆతర్వాత సొరకాయ చెక్కు తీసి తురిమి అందులో కాస్త ఉప్పు కలిపి శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి అరగంట పాటు ఉంచాలి. అప్పుడు అందులోని నీరంతా కూడా పోతుంది. ముందుగా రుబ్బిపెట్టుకున్న మినప్పిండిలో ఈ తురుమూ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్రా, కరివేపాకు తరుగూ, అల్లం తరుగూ, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టాలి. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లా చేసుకుని కాగే నూనెలో వేయించి తియ్యాలి. అంతే.. సూపర్ గా ఉంటాయి.