వంటా వార్పు: ఎంతో రుచిక‌ర‌మైన `ఎగ్ కబాబ్స్` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
కోడిగుడ్లు- ఐదు
ఉల్లిపాయ ముక్కులు- అర క‌ప్పు
గరం మసాలా- అర‌ టీస్పూన్‌

 

శెనగపిండి- ఒక క‌ప్పు
బ్లాక్ పెప్పర్- అర టీస్పూన్‌
కారం- ఒక టీస్పూన్‌
బ్రెడ్ పొడి- ఒక కప్పు

 

నూనె- త‌గినంత‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కొత్తిమీర తరుగు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా కోడిగుడ్లు స‌రిప‌డా ఉడకబెట్టి పెంకు తీసేయాలి. ఇప్పుడు గుడ్డుని సన్నగా తురిమేయాలి. ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా తురిమిన కోడి గుడ్లను వేసుకోవాలి. అనంత‌రం శెనగపిండి, ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కారం, బ్రెడ్ పొడి, నీళ్లు, ఉప్పు వేసి అన్ని క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి.

మిశ్రమం మరీ జారేట్టు కాకుండా.. గారెల పిండిలా నీటి సాయంతో క‌లుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కబాబ్స్ ఆకారంలో చేత్తోనే ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. పాన్ పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత అందులో నూనె వేసి కాగ‌నివ్వాలి. అనంత‌రం చేత్తో ఒత్తిన కబాబ్ లు కాగిన నూనెలో వేసి వేయించాలి. 

చిన్న మంట మీద కాసేపు వేయిస్తే బాగా వేగుతాయి. ఇలా కబాబ్స్ అన్నీ నూనె వేసి మీకు కావాల్సిన క‌ల‌ర్‌లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని స‌ర్వింగ్ ప్లైట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ కబాబ్స్ రెడీ అయిన‌ట్లే. వీటిని ఏదైనా చ‌ట్నీతో తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: