వంటా వార్పు: ఘుమ‌ఘుమ‌లాడే `నువ్వుల చికెన్ కర్రీ` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్ - అరకిలో
నువ్వులు - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు

 

సోయాసాస్ - ఒక టేబుల్ స్పూన్‌
క్యాప్సికమ్ ముక్క‌లు - అర క‌ప్పు
పచ్చిమిర‌ప‌కాయ‌లు - మూడు

 

నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌

 

కార్న్ ఫ్లోర్ - రెండు టీస్పూన్లు
నిమ్మరసం - ఒక టీస్పూన్‌
కొత్తమీర త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా చికెన్‌ను బాగా కడిగి నీళ్లు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు, సోయాసాస్ వేసి బాగా కలపాలి. అనంత‌రం ఈ మిశ్రమాన్ని నాలుగు గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. 

నాలుగు గంట‌ల త‌ర్వాత ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ మిశ్ర‌మాన్ని బయటపెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి..కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులోనే నువ్వుల్ని వేసి కొన్ని సెకన్ల పాటూ వేయించాలి. తరువాత మారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించి బయటికి తీయాలి. 

తీసేశాక మిగిలిన నూనెలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ‌ ముక్కలు వేయించాలి. అవి వేగాక... వేయించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి కలపాలి. ఒక అయిదు నిమిషాల తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే నువ్వుల చికెన్ క‌ర్రీ రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ నువ్వుల చికెన్ కర్రీ రెసిపీని మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: