వంటా వార్పు: నోరూరించే `పనీర్ పులావ్` తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు!!
కావాల్సిన పదార్థాలు:
బియ్యం - ఒ కప్పులు
పనీర్ ముక్కలు - ఒక కప్పు
బంగాళదుంప ముక్కలు - ఒక కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు
టమోటో ముక్కలు - అర కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
అజినో మోటో - చిటికెడు
నూనె - నాలు టేబుల్ స్పూన్లు
వెన్న - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర టీ స్పూన్
కొత్తిమీర తురుము - అర కప్పు
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వెయ్యాలి. నూనె వేడి అయ్యాక.. అందులో పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. రువాత అదే పాన్లో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి.
కాస్త ఉప్పు వేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో మరియు గరంమాసాలా వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఒక పది, పదిహేను నిమిషాల తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో కారం, సరిపడా ఉప్పు వేసి మళ్లీ కలుపుకోవాలి.
రెండు నిమిషాల పాటు పనీర్ ముక్కలు వేగించి.. అనంతరం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి కలపాలి. ఇక చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే నోరూరించే పనీర్ రైన్ రెడీ అయినట్లే. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబట్టి, మీరు కూడా ఈ టేస్టీ పనీర్ పులావ్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.