వంటా వార్పు: నోరూరించే `గోంగూర చికెన్ బిర్యానీ` ఎలా చేయాలంటే??

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం - అర‌ కేజీ
చికెన్ - అర‌ కేజీ
గోంగూర - ఒక కట్ట
లవంగాలు - మూడు 

 

దాల్చిన చెక్క - రెండు చిన్న ముక్కలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక‌ టేబుల్ స్పూన్‌
కారం - రెండు టేబుల్ స్పూన్స్
పెరుగు - ఒక‌టిన్న‌ర‌ కప్పు 

 

పచ్చిమిర్చి - నాలుగు
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు
ఉప్పు - రుచికి స‌రిప‌డా

 

సాజీరా - ఒక‌ టీ స్పూన్‌
యాలకులు - మూడు
కొత్తిమీర - ఒక క‌ట్ట‌
పుదీనా - ఒక‌ కట్ట 

 

త‌యారీ విధానం: 
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌రోవైపు బియ్యాన్ని కూడా క‌డిగి.. నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక‌.. లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

 

ఇవి దోర‌గా వేగాక‌.. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర‌ వేసి నాలుగు నిమిషాలు వేయించి.. అనంత‌రం గోంగూర కూడా వేసి వేగించాలి. కాసేపు గోంగూర వేగ‌నిచ్చి.. తర్వాత పెరుగు, చికెన్, కారం, స‌రిప‌డా ఉప్పు వేసి సన్నటి సెగపై ఉడికించాలి.

 

ఇప్పుడు మరో గిన్నెలో ఎసరు మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై ఇర‌వై నుంచి ముప్పై నిమిషాలు ఉడికించుకుంటే స‌రిపోతుంది.

 

అంతే నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయినట్లే. వేడి వేడిగా ఉన్న‌ప్పుడు దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: