వంటా వార్పు: టేస్టీ టేస్టీ `మష్రూమ్స్ ఫ్రై` ఎలా చేయాలంటే..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్ - ఒక‌ కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
కరివేపాకు - మూడు రెమ్మలు

 

ఆవాలు - పావు టీ స్పూన్
గరంమసాలా - అర‌ టీ స్పూన్
ఉప్పు - రుచికి స‌రిప‌డా
జీడిపప్పు- అర‌ కప్పు

 

కారం - ఒక‌ టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు
టమాటా ముక్క‌లు - అర క‌ప్పు
పచ్చి మిర్చి - మూడు

 

జీలకర్ర - పావు స్పూన్
నూనె - ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్స్
పసుపు - పావు టీ స్పూన్‌
కొత్తిమీర తురుము - అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా మష్రూమ్స్ శుభ్రం చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌రోవైపు జీడిపప్పును పావు గంట పాటు నీటిలో నానపెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్‌ పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయించాలి. 

ఇవి వేగాక  కరివేపాకు,‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా వేసి మ‌రి కొన్ని సిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్, నాన బెట్టుకున్న జీడిపప్పు, సరిపడా ఉప్పు వేసి కలపాలి. 

ఇప్పుడు దీనిని సన్నని మంటపై ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన త‌ర్వాత‌.. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ మష్రూమ్స ఫ్రై రెడీ అయినట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ రుచిక‌ర‌మైన రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: