క్యారెట్ సూప్... ఇంత టేస్టీగా చేసుకోవచ్చా...!
అసలు ఎం ఎం కావాలో ఒకసారి చూద్దాం... క్యారెట్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, బంగాళ దుంపలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు తీసుకోండి.
అదే విధంగా గార్నిష్ కోసం గానూ ఉల్లిపాయ – ఒకటి తీసుకోండి. పాల కూర - ఒక కట్ట తీసుకోండి. పాలు - పావు కప్పుతో పాటుగా... నూనె – కొద్దిగా... కాస్త జాగ్రత్తగా వేసుకోండి. అలాగే మిరియాల పొడి - అర టీ స్పూన్, ఉప్పు – తగినంత వేసుకోవాలి.
ఒకసారి తయారి విధానం చూస్తే... క్యారెట్లు శుభ్రంగా కడిగి... అసలు కొంచెం కూడా ఇసుక లేకుండా జాగ్రత్తగా తురుమాలి.. కొంత మంది క్యారెట్ విషయంలో లైట్ గా ఉంటారు. ఏమీ కాదులే అని... కానీ శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత... బంగాళ దుంపలు పొట్టు తీసి వేసి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కుక్కర్‌లో ఐదు కప్పుల నీళ్లు పోసి క్యారెట్లు, ఉల్లిపాయ, బంగాళ దుంపలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆవిరి పోయిన తరువాత వాటిని బయటకు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అప్పుడు మరొక పాత్రను స్టవ్ పై పెట్టి... నూనె వేసి కాస్త వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, పాల కూర వేసి వేయించుకోవాలి. మిక్సీలో పట్టుకున్న స్టాక్ ను వేసి... కొంచెం సేపు వేయించి... పాలు వేడి చేసి పోయాలి. ఆ తర్వాత బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి చల్లి వేడిగా దించండి.