పాలకూర చికెన్ ఎలా వండాలో చూడండి... చాలా సింపుల్...!

Sahithya
కొంత కొంత మందికి మంచి మంచి వంటకాలు తినాలి అనే కోరిక ఉంటుంది గాని చేసుకుని తినడం రాక పాపం  ఉసూరుమంటూ చూస్తూ ఉంటారు. వీకెండ్ వస్తుంది అంటే చాలు ఏదో స్పెషల్ కావాలి అనే కోరిక అందరికి ఉంటుంది. చాలా వరకు పాపం వంటలు రాక బయట కొనుక్కుని తింటారు. అవి ఏమో అంతగా రుచించవు. అందుకే మీకోసం ఒక మంచి వంట చెప్తాను ట్రై చేయండి... చాలా ఈజీ అన్నమాట. అదే పాలకూర చికెన్. ఎలా ఏంటీ అనేది కిందకు వచ్చి చదవండి...

కావలసినవి ఏంటీ అంటే... పాలకూర – అర కేజీ అంటే ఒక ఆరు కట్టలు అన్నమాట. బోన్‌ లెస్‌ చికెన్‌ - అర కేజీ చాలు. ఇంకా ఎక్కువ కావాలి అంటే మీ ఇష్టం. నూనె – తగినంత వేసుకోండి. ఉప్పు  మీరు తినే దాని బట్టి వేసుకోండి. పచ్చి మిర్చి – రెండు మూడు చాలు. జీలకర్ర పొడి - పావు టీ స్పూన్‌ వేసుకోండి. ఉల్లిపాయ – ఒకటి చాలు. అల్లం – చిన్న ముక్క వేయండి. ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు – నాలుగు చాలు.

ఎలా వండుకోవాలో కూడా చెప్తాను... పాల కూరను పావు గంట పాటు కచ్చితంగా నీళ్ళలో నానబెట్టాలి... ఇసుక ఉంటుందిగా అందుకే.  ఆ తర్వాత ఒక నాలుగు సార్లు కడగండి. అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్‌ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేసి వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని వేయించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలుపుకుని కాసేపు వేగిన అనంతరం ఒక బౌల్ లో తీసుకుని కుక్కర్ లో పాల కూర వేసి... కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి.  

నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేయించుకోండి. కాసేపు వేయించిన తర్వాత నీళ్ళు పోసుకుని...చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేసుకోండి. పాలకూర వేసి మరో అయిదు నిమిషాలు ఉంచితే చాలు. వర్షాలు పడుతున్నాయిగా వేడి వేడిగా వేసుకుని టీవీ చూడకుండా స్లో గా ఎంజాయ్ చేయండి... హ్యాపీ వీకెండ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: