ఎగ్ వడ చాలా ఈజీగా...!

Sahithya
చికెన్ తో కోడి గుడ్లతో మనకు ఓపిక ఉండాలే గాని చాలా వంటలు చేసుకోవచ్చు. చాలా మందికి బద్దకం కారణంగా చేసుకోలేరు పాపం. అయితే చేసుకోవడం వస్తే మాత్రం చాలా వంటలు చేసుకోవచ్చు.  కాబట్టి మీకు నేను ఇప్పుడు ఎగ్ వడ ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఇది స్నాక్స్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు దానికి ఎం కావాలి ఏంటీ అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను.

అసలు ఎం ఎం కావాలంటే...కోడి గుడ్లు – నాలుగు (ఉడికించినవి) కావాలి. అలాగే  కార్న్‌ ఫ్లోర్‌ - ఒక కప్పు, సెనగ పిండి - రెండు కప్పులు కావాలి. బియ్యపు పిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత వేసుకోండి. నూనె – సరిపడా వేయండి.  వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అలాగే పచ్చి మిర్చి – నాలుగైదు వేయండి. ఉల్లిపాయలు - రెండు, అల్లం  - చిన్న ముక్క, తోటకూర - ఒక కట్ట చాలు.

తయారీ ఎలా అంటే... ఒక పాత్రలో కోడి గుడ్లను కొట్టి వేయండి. ఆ తరువాత అందులో సెనగ పిండి, బియ్యపు పిండి వేసి కలపండి. అప్పుడు తగినంత ఉప్పు, కారం వేసేయండి. కార్న్‌ ఫ్లోర్‌ వేసి కలపండి. అప్పుడు తరిగిన పచ్చి మిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసేయండి. ఇక  తోటకూరను చిన్నగా కట్‌ చేసి  వేయండి. అన్నీ బాగా కలిసేలా జాగ్రత్తగా కపండి. ఇప్పుడు ఆ  మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా తయారు చేయాలి. పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకుంటే చాలు... ఎగ్ వడ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: