చాలా ఈజీగా పుచ్చకాయ తొక్క హల్వా...!
కావలసినవి ఏంటి అంటే... పుచ్చ కాయపై తొక్క భాగం, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు కావాలి. అలాగే బొంబాయి రవ్వ - టేబుల్ స్పూను కావాలి. శనగ పిండి టేబుల్ స్పూను వరకు కావాలి. పంచదార- అర కప్పు కావాలి. దాల్చిన చెక్క పౌడర్ - అర టేబుల్ స్పూను కావాలి. జాజి కాయ పౌడర్ - చిటికెడు చాలు. పాలు - కప్పు చాలు. బాదం – పిడికెడు పప్పులు.
తయారి ఎలా అంటే... పుచ్చ కాయను తిన్న తర్వాత పైన మిగిలే ఆకుపచ్చ ముక్కలు తీసుకుని... వాటి చివర్లను, పైన పచ్చగా కనిపించే భాగాన్ని చాకుతో కట్ చేసేయండి. లోపల తెల్లటి భాగం మాత్రమే ఉండేలా చేయండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ లో వేసి మెత్తటి గుజ్జు చేయండి. కడాయిలో నెయ్యి వేసి వేడి చేసి... బొంబాయి రవ్వ, సెనగ పిండి వేసి కలుపుతూ గోధుమ రంగులోకి వచ్చే వరకు సన్న మంట మీద వేడి చేసేయండి. గ్రైండ్ చేసుకున్న గుజ్జును ఇందులో వేసి, పెద్ద మంట మీద నీరంతా ఆవిరై పోయే వరకు ఉడికించండి. దీనికి పంచదార, దాల్చిన చెక్క, జాజి కాయ పౌడర్ లు వేయండి. ఆ తరువాత పాలు పోసి, బాదం, పిస్తా పప్పులు వేసుకోని ఒక పాత్రలోకి తీసుకొని చల్లారనివ్వండి. అంతే చాలా సులువగా ఓపికగా చేసుకోవచ్చు. టైం పాస్ కాని వాళ్లకు బాగా పని చేస్తుంది.