రుచికరమైన క్యాబేజి బఠాణి కూరని ఎలా చెయ్యాలో నేర్చుకోండి...

Purushottham Vinay
క్యాబేజీ బఠాణీ రుచి కె కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాబేజీ బఠాణిని ఇష్టపడని భారతీయుడు ఉండడు. అంత సాంప్రదాయకమైన వంటకం. క్యాబేజీ బఠానీ కూర ఎంతో త్వరగా రెడీ అయ్యే డిష్. భారత మసాలతో తయారు చేసే ఈ కూర ఎన్నో పోషకాలతో నిండి ఉండడం వల్ల అంతే ఆరోగ్యాన్ని ఇస్తుంది.ఇప్పుడు క్యాబేజీ బఠాణీ వంటకం ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి...

క్యాబేజీ బఠాణీ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం...

250 గ్రాములు కాబేజీ

1 కప్ బఠానీలు

ప్రధాన వంటకానికి....

2 కప్ టమాటో ప్యూరీ

అవసరాన్ని బట్టి పసుపు

అవసరాన్ని బట్టి కారప్పొడి

1 టీ స్పూన్ ధనియాల పొడి

1 టీ స్పూన్ జీలకర్ర

అవసరాన్ని బట్టి హిమాలయన్ సాల్ట్

1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర

1 టీ స్పూన్ పచ్చి మిర్చి

1 అల్లం

అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా శుద్ధి చేసిన నూనె..



క్యాబేజీ బఠాణీ తయారు చేయు విధానం...



ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసి పక్కనపెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని స్టౌపై పెట్టి వేడిచేయాలి.పాన్ వేడి అయిన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లంతురుము వేసి వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసి 5 నిమషాల పాటు ఫ్రై చేయండి.

క్యాబేజీ మెత్తగా ఉడికిన తర్వా అందులో బఠానిలు వేసి కలపండి. ఆ తర్వాత సేంద్రియ ఉప్పు వేయండి. ఇప్పుడు మంటను తగ్గించి మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించండి.

ఇప్పుడు అందులోనే టమోటా ప్యూరీ వేసి పదార్థాలన్నింటికీ పట్టేలా చిన్న మంటపై 6 నిమిషాల పాటు ఉడికించండి.

ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూసి కూరగాయలు ఉడికకపోతే మంట కాస్తా పెంచి 2 నిమిషాల పాటు ఉడికించండి.

అంతే, ఇప్పుడు వేడి వేడి క్యాబేజీ బఠానీ కూర రెడీ అయినట్లే. దానిని ఓ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఇది రోటీలకు సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: