నోరూరించే క్యారెట్ ఖీర్ ని సింపుల్ గా రుచిగా తయారు చేసుకోండిలా...
కావాల్సిన పదార్ధాలు...
ప్రధాన పదార్థం...
2 తురిమిన క్యారెట్
ప్రధాన వంటకానికి...
1 లీటర్ పాలు...
1 కప్ నెయ్యి...
అవసరాన్ని బట్టి జీడిపప్పు...
అవసరాన్ని బట్టి ఎండు ద్రాక్ష...
అవసరాన్ని బట్టి పొడిగా చేసిన యాలకులు...
4 టీ స్పూన్ చక్కర...
క్యారెట్ పాయసం తయారీ విధానం...
ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా కడిగి తురిమి పక్కనపెట్టాలి. ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో జీడిపప్పులు, పిస్తాపప్పులు, ఎండు ద్రాక్షలు వేసి 2 నిమిషాల పాటు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్లో క్యారెట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత అందులో పాలు వేసి 10 నిమిషాల వరకూ ఉడికించాలి.
హల్వా ఉడికి దగ్గరపడేవరకూ ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి మరికాసేపు ఉడికించాలి. పంచదార మొత్తం కరిగేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు పాయసంలో నెయ్యి వేసి కలపాలి. చివరిగా డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి స్టౌ ఆపివేయాలి.
ఇలా తయారైన హల్వా వేడిగానైనా తినేసేయొచ్చు.. ఫ్రిజ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత అయిన తినేసేయొచ్చు.
ఇక రుచికరమైన ఈ క్యారెట్ ఖీర్ ను బాగా ఆస్వాదిస్తూ మీరు మీ పిల్లలు మరియు మీ ఆత్మీయులు బాగా ఎంజాయ్ చేస్తూ తినండి...