రుచికరమైన అల్లం బర్ఫి ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి..అల్లం బర్ఫి మహారాష్ట్ర లో ఎంతో ఫేమస్ స్వీట్. ఈ ఇది చాలా రుచికరమైన స్వీట్.. చాలా తియ్యగా రుచికరంగా ఉంటుంది..ప్రసిద్ధ మహారాష్ట్ర స్వీటు అయిన అల్లం బర్ఫీ మెల్లగా దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా పాపులర్ అవుతోంది. ఈ తియ్యని వంటకం మీరు చలికాలంలో చక్కగా ఆస్వాదించవచ్చు. సరిగ్గా కలిసిన ఘాటు ఇంకా తీపి రుచులతో ఈ బర్ఫీ ఎక్కువగా క్యాండీలానే అన్పిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. దీపావళి స్వీట్లలోనే అల్లం బర్ఫీ హిట్ కాబట్టి, మిగతా సమయాల్లో కూడా దీన్ని ప్రయత్నించి ఆస్వాదించవచ్చు.మరి ఈ రుచికరమైన అల్లం బర్ఫీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

అల్లం బర్ఫీ కి కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థంగా  ఇవి తీసుకోవాలి...

200 గ్రాములు తురిమిన అల్లం...

4 టీ స్పూన్ నెయ్యి...

ప్రధాన వంటకానికి...

2 కప్ చక్కర...

2 కప్ పాలు...

1 టేబుల్ స్పూన్ యాలకులు..

అవసరాన్ని బట్టి ఉప్పు...


రుచికరమైన అల్లం బర్ఫి తయారు చేయు విధానం...


మిక్సీలో అల్లాన్ని వేసి మెత్తని పేస్టులా రుబ్బండి.ఒక కడాయిలో నెయ్యి వేసి వేడెక్కగానే, అల్లం పేస్టుని వేసి అల్లం నుండి నూనెపదార్థం వేరు అయ్యేవరకు 5-8 నిమిషాల పాటు ఉండనివ్వండి.ఇప్పుడు పంచదార కూడా వేసి అన్నిటినీ చక్కగా కలపండి. 10-12 నిమిషాల పాటు అన్ని పదార్థాలని కలుపుతూ ఉడకనివ్వండి.

సరైన జారుడు మిశ్రమం వచ్చాక, అరకప్పు పాలు పోసి కలపండి. కొంచెం గట్టిపడేవరకూ కలుపుతూ ఉండండి.అరచెంచా ఏలకుల పొడిని ఇంకా చిటికెడు ఉప్పుని కూడా వేసి సరిగ్గా మొత్తం కలపండి.

అన్ని పదార్థాలు బాగా కలిసాక, నెయ్యి రాసిన డిజైన్ లేని పలకలాంటి పళ్ళెంలోకి మిశ్రమాన్ని పోయండి. 20 నిమిషాల దాకా ఆ పళ్ళేన్ని కదపకుండా మిశ్రమాన్ని చల్లబడనిచ్చి, బర్ఫీని నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకోండి.డ్రై ఫ్రూట్లతో అలంకరించి వేడిగా లేదా చల్లగా తినండి చాలా బాగుంటుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వంటకాల ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: