రుచికరమైన గుజరాతి వంటకం దబేలి ఎలా చెయ్యాలో తెలుసుకోండి....
కావాల్సిన పదార్ధాలు...
ధనియాలు,
జీలకర్ర,
దాల్చిన చెక్క,
మిరియాలు,
లవంగాలు,
బిర్యానీ ఆకు,
ఎండు కొబ్బరి,
ఎండు మిర్చి,
నువ్వుల నూనె,
ఆమ్ చూర్ పొడి,
ఉప్పు తగినంత,
చింతపండు రసం,
నూనె తగినంత,
బంగాళాదుంప,
కొత్తిమీర,
కారపపూస,
దానిమ్మ గింజలు,
కొబ్బరి పొడి,
పల్లి...
దబేరి తయారు చేయు విధానం...
ముందుగా కొద్దిగా ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీఆకు, ఎండుకొబ్బరి తీసుకోవాలి. ఎండుమిర్చి, నువ్వులను నూనె లేకుండా వేయించాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఆమ్చూర్ పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం తీసుకుని కడాయిలో నూనె పోసి వేడిచేసి ఈ మిశ్రమాన్ని వేడిచేయాలి.దీంట్లో ఉడకబెట్టిన బంగాళాదుంపల మిశ్రమాన్ని కలిపి మెత్తని ముద్దలా చేయాలి. ఇంకా కొబ్బరిపొడి, కొత్తిమీర, కారప్పూస, దానిమ్మగింజలు, వేయించిన పల్లీలు వేయాలి. చాకుతో పావ్ మధ్యలో కొద్దిగా కోసి చెంచా బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు ఈ పావ్‌ను కడాయి మీద పెట్టి వేడిచేయాలి. చివరగా కారప్పూసలో ఈ పావ్‌ను దొర్లిస్తే నోరూరించే కచ్చీ దబేలీ సిద్ధమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...