రుచికరమైన సకినాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
మన భారతీయ వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత రుచికరమైన వంటకాలు మన భారతీయ వంటకాలు.అలాగే ఆరోగ్యకరమైన వంటకాలు మన దేశపు వంటకాలు. అందుకే మన పూర్వికులు మన వంటకాలు తిని అప్పట్లో చాలా సంవత్సరాలు బ్రతికారు.ముఖ్యంగా మన పిండి వంటలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. మన పిండి వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి. మళ్ళీ మన దక్షిణ భారతదేశపు వంటకాలలో చెప్పుకోదగ్గవి సకినాలు. సకినాలు ఎంతో రుచికరమైనవి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కూడా.ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన సకినాలు ఎలా చెయ్యాలో తెలుసుకుందాం...


సకినాలు తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....


బియ్యం - ఒక కప్పు;
నువ్వులు - అర కప్పు;
వాము - అర టీ స్పూను;
ఉప్పు - తగినంత;
నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా...


సకినాలు తయారు చేసే విధానం.....


ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి.బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంటసేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ∙ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి.తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ∙కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి).మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి.స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి.ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ రుచికరమైన సకినాలు మీరు ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: