రుచికరమైన ఆంధ్ర రొయ్యల గ్రేవీ ఇలా చేయండి..!

Suma Kallamadi
చాలా మందికి మాంసం లేనిదే ముద్ద దిగదు. అయితే ఇంట్లోనే రుచికరమైన రొయ్యల గ్రేవీ ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూద్దామా.

తయారీ విధానం :


ముందుగా రొయ్యలను శుభ్రంగా కడుక్కొని... స్టవ్‌పై ప్యాన్ పెట్టి... 1 టీస్పూన్ ఆయిల్ వెయ్యాలి. అందులో అర టీస్పూన్ పసుపు వేసి... మీడియం ఫ్లేమ్‌లో 3 నిమిషాలు వేపాలి. ఇప్పుడు రొయ్యలను వేసి... వేపాలి. తద్వారా వాటి పచ్చివాసన పోతుంది. వేపిన వాటిని ఓ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెయ్యాలి. ఇప్పుడు పలావు ఆకులు 2, నల్ల మిరియాలు 10, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 3, యాలకులు 1, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేపాలి. ఇప్పుడు ఓ పది కరివేపాకులు వేసి వేపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి... 3 ఉల్లిపాయల ముక్కలను వెయ్యాలి. 6 నిమిషాలు వేపాలి. అటూ ఇటూ కదుపుతూ ఉండాలి. బాగా ఉడికేందుకు అర టీస్పూన్ ఉప్పు వెయ్యాలి. మూత పెట్టి 6 నిమిషాలు ఉడికించాలి.


వెంటనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఓ టేబుల్ స్పూన్ వెయ్యాలి. బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వెయ్యాలి. అర టీస్పూన్ జీలకర్ర పొడి వెయ్యాలి. 2 టీస్పూన్ల కారం వెయ్యాలి. అర టీస్పూన్ పసుపు వెయ్యాలి. చిన్న మంటపై 7 నిమిషాలు ఉడికించాలి.  అటూ ఇటూ కదిపి మూత పెట్టాలి. 7 నిమిషాల తర్వాత మూత తియ్యాలి. అటూ ఇటూ కదిపి... 2 టమాటాల చిన్న ముక్కలు వెయ్యాలి. మంట బాగా పెంచి 3 నిమిషాలు వేపాలి. ఇప్పుడు ఉప్పు 1 టీస్పూన్ వెయ్యాలి. ఇప్పుడు చిన్న మంటపై 10 నిమిషాలు టమాటాలను వేపాలి. ఇందుకోసం మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తియ్యాలి. మళ్లీ అటూ ఇటూ కదపాలి. ఇప్పుడు నీరు కొద్దిగా పొయ్యాలి. బాగా కదపాలి.


ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వెయ్యాలి. 4 పచ్చిమిర్చి పొడవు ముక్కలుగా ఉన్నవి వెయ్యాలి. 15 కరివేపాకులు వెయ్యాలి. కొబ్బరి పొడి 1న్నర టేబుల్ స్పూన్ వెయ్యాలి. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు రొయ్యలను వేసి ఫ్రై చెయ్యాలి. అటూ ఇటూ కదపాలి. ఇప్పుడు 3 కప్పుల నీరు పొయ్యాలి. మంటను పెంచాలి. ఇప్పుడు గరం మసాలా అర టీస్పూన్ వెయ్యాలి. కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వెయ్యాలి. బాగా నెమ్మదిగా కదపాలి. చివరికి కొంచెం మిర్యాల పొడి వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: