ఎగ్ తో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?
కావలసిన పదార్థాలు:
గుడ్లు: 2,
కరివేపాకు: రెండు రెబ్బలు,
పచ్చిమిర్చి: రెండు,
ఉప్పు: తగినంత,
ఇంగువ: చిటికెడు,
నూనె: సరిపడినంత,
చిల్లీసాస్: ఒక టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి, ప్యాన్ పెట్టీ నూనె వేయాలి.. నూనె వేడయ్యాక కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. బాగా వేగిన పచ్చిమిర్చి ముక్కలపై చిటికెడు ఇంగువ వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికాస్త నూనె వేసి, వేడయ్యాక గుడ్లు కొట్టి వేయించాలి. బాగా వేగాక తగినంత ఉప్పు వేసి కలిపి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి వేయించిన పచ్చిమిర్చి ముక్కలు వేసి చిల్లీసాస్ కలిపితే సరి. ఎగ్ తడ్కా రెడీ.. ఇలా చేసుకొని తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది.. అంతేగా కొత్తగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈ వెరైటీ వంట మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..