చికెన్ మాలై కోఫ్తా రెసిపీ మీకోసం.. !
కాజు పేస్ట్ కోసం:
1/3 cup జీడిపప్పు (Soak for 30 minutes)
2 tsp బాదాం (Soak for 30 minutes)
కోఫ్తా కోసం :
250 gms బోన్లెస్ చికెన్ (ground to a smooth paste in the mixie)
ఉప్పు
1/2 tsp మిరియాల పొడి
1/2 tsp గరం మసాలా
1/2 tsp అల్లం వెల్లులి ముద్ద
1 tbsp నూనె
2 tsp కొత్తిమీర తరుగు
1 పచ్చిమిర్చి మధ్యకి చీరిన సన్నని తరుగు
2 tsp నూనె వేపుకోడానికి
గ్రేవీ కోసం:
3 tbsp నూనె
1 tbsp నెయ్యి
2 యాలకలు
2 లవంగాలు
ఇంచ్ దాల్చిన చెక్క
ఉప్పు
1 cup ఉల్లిపాయ తరుగు
1 పచ్చిమిర్చి తరుగు
1/2 tsp అల్లం వెల్లులీ ముద్ద
1.5 cup నీళ్ళు
1/2 tsp మిరియాల పొడి
1 tsp నెయ్యి
2 tsp ఫ్రెష్ క్రీమ్ (పాల మీగడ )
విధానం:
కోఫ్తా కోసం బోన్లెస్ చికెన్ ను మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకోవాలి.ముందుగా చికెన్ కోఫ్తాల కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నిమ్మకాయ సైజు బాల్స్ లాగా చేసి ఉంచుకోండి.కోఫ్తా వేపేటప్పుడు నూనెలో కోఫ్తాలు వేసి కదపకుండా ఒక నిమిషం వదిలేయాలి,ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ కాల్చుకుంటే కోఫ్తాలు విరగవు. కోఫ్తాలు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. కోఫ్తాలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన జీడిపప్పు,బాదాం పప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె, నెయ్యి, యాలక, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేపుకోవాలి. తరువాత సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయలు ఎర్రబడేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్నప్పుడు పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లూలీ ముద్ద వేసి ఎర్రగా వేపుకోవాలి.ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
నూనె పైకి తేలాక నీళ్ళు పోసి గ్రేవీ సగం అయ్యేదాక మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మధ్య మధ్యన కలుపుతుండాలి. లేదంటే అడుగు అంటుంది. ఇప్పుడు గ్రేవీ సగం అయ్యాక వేపుకున్న కోఫ్తాలు వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. (అవసరమైతే కొద్దిగా వేడి నీళ్ళు పోసి పలుచన చేసుకోవచ్చు).ఆఖరుగా ½ మిరియాల పొడి, ½ tsp గరం మసాలా, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి దింపేసుకోవాలి.