అరటితో 'టీ' చేద్దామా.?

Suma Kallamadi
సాధారణంగా చాలా మందికి ప్రతిరోజు టీ తాగనిదే రోజు గడవదు. పొద్దునే లేచి ఒక కప్పు టీ  తాగితే గాని మనసుకు ప్రశాంతత ఉండదు. చాలామందికి ఒక్కరోజు టీ తాగకపోతే చాలు తలనొప్పి వచ్చేస్తుంది. అంతలా టీ కు బానిసలు అయిపోతారు. అయితే ఇప్పుడు కరోనా పుణ్యమా అని రకరకాల హెల్తీ టీలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇప్పుడు కాస్త వెరైటీగా అరటితో  టీని తయారు చేసుకుందాం. దాని రుచి కూడా చాలా బాగుంటుంది. మనకి అరటి పళ్లు విరివిగా దొరుకుతాయి. అలాగే అరటి పండులో అనేకపోషక విలువలు కూడా ఉంటాయి. అలాగే చాలా రెసిపీల్లో అరటీ పండ్లను వాడతారు. టీ లో కూడా దీన్ని ట్రై చేశారు.ఈ బననా టీ తాగడం వలన రిలాక్సేషన్‌ ఫీలింగ్‌ కూడా వస్తుందట. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొద్ది నీళ్లు పోసి అరటి పండును ఓ పదినిమిషాలు బాగా ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు బుడగలు వస్తాయి, వాటిని తీసేసి ఆ నీటిని తాగుతారు. ఈ నీటిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు.ఈ నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. మీకు  నచ్చితే అరటి తొక్కతోపాటు ఉడికించుకోవచ్చు. తొక్కే కదా అని తీసేయకండి. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్‌ ఉంటుంది.మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆహారం వెంటనే రక్తంలో కలిసిపోకుండా చేస్తుంది. అందుకే డయాబెటీస్‌ ఉన్న వారు తప్పక తీసుకోవాలి. మీకు నచ్చిన విధాంగా ఇందులో దాల్చినచెక్క,  తేనే కూడా కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఈ టీని రాత్రివేళ తాగితే నిద్ర లేమి సమస్య ఉండదు. ఈ టీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్తయి. అవి మీ గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. బనానా టీ ని ఫ్రిజ్‌లో కూడా రెండు రోజుల పాటు నిల్వ పెట్టుకుని తాగవచ్చు. మరి మీరు కూడా ఒకసారి బననా టీ ను ట్రై చేసి చూడండి. !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: