ఈ పచ్చడి రుచి చూస్తే ఆహా అంటారు సుమా. !
కావాల్సిన పదార్ధాలు:
1/2 kg పండు టొమాటోలు
8 -10 పచ్చిమిర్చి
2 tbsp నువ్వులు
5 వెల్లూల్లి రెబ్బలు
1/4 tbsp మెంతులు
1 tbsp ధనియాలు
1 tsp జీలకర్ర
3 tbsps నూనె
ఉప్పు
తాలింపుకు
కరివేపాకు (One Sprig)
1/2 tsp ఆవాలు
2 tsps నూనె
1/4 tsp జీలకర్ర
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేపాలి. ఆఖరున నువ్వులు వేసి చిటచిట అనేదాకా వేపుకోండి. తరువాత అన్నిటిని చల్లార్చి మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి వేసి మగ్గించుకోండి, పచ్చిమిర్చి మగ్గాక అందులో టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.నాటు టొమోటోలు అయితే పచ్చడి పుల్లగా రుచికరంగా ఉంటుంది. టొమాటోలు పూర్తిగా మగ్గి గుజ్జుగా అవ్వాలి, అవసరమయితే నూనె కొంచెం ఎక్కువ పోయండి. నూనెలో టొమోటో ముక్కలు మగ్గితే రుచికరంగా ఉంటాయి.ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు నువ్వుల పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోండి.తరవాత నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆ తాలింపును చట్నీ లో కలుపుకోండి.అంతే ఎంతో రుచికరమైన టొమోటో నువ్వుల పచ్చడి రెడీ అయినట్లే.. !!