ఈ అల్లం చట్నీ రుచి అదరహో.. !
కావాల్సిన పదార్ధాలు:
200 gm పచ్చిమిర్చి
75 gm అల్లం
100 gm బెల్లం
50 - 70 gm చింతపండు
వెల్లుల్లి రెబ్బలు -2
ఉప్పు – రుచికి సరిపడా
వేడి నీళ్ళు
2 tbsp నూనె
తాలింపు కోసం :
2 tbsp నూనె
1 tsp అవాలు
1 tsp జీలకర్ర
2 రెబ్బలు కరివేపాకు
2 ఎండుమిర్చి
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త రంగు మారే దాకా వేపుకోవాలి. మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ముక్కలు ముక్కలుగా కోసి నూనెలో వేపాలి. లేదంటే అలాగే వేస్తే పేలుతాయి. పచ్చిమిర్చి ముక్కలు వేగాక అల్లం ముక్కలు వేసి 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయే దాక వేపాలి. ఇప్పుడు చల్లారిన అల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లులి పాయలు, బెల్లం అన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.కొంచం కొంచెంగా వేడి నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టండి. తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేసి తాలింపు సామానంతా ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకుని పచ్చడిలో కలిపేసుకోండి.ఈ పచ్చడిని వేడి నీళ్ళతో మాత్రమే రుబ్బాలి. లేదంటే పచ్చడి నిల్వ ఉండదు. అంతే ఎంతో స్పైసీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయినట్లే. !