లివర్ ఫ్రై ఇలా చేస్తే వావ్ అనల్సిందే..!

Suma Kallamadi
చికెన్ తో పాటు చాలా మంది లివర్ కూడా ఇష్టంగా తింటారు. ఈ లివర్ ను కూరల్లో వేసి వండే కంటే ఫ్రై చేసుకుంటే చాలా రుచి కరంగా ఉంటుంది. ఈ రోజు ఇండియా హెరాల్డ్ వారు లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో మీకు వివరించ బోతున్నారు.మరి ఆలస్యం చేయకుండా లివర్ ఫ్రై కి కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
200 గ్రాములు చికెన్ లివర్
2 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి
4 పచ్చి మిరపకాయలు
¼ tsp పసుపు
3 tsp కారం
3 tsp ధనియాల పొడి
1 tsp గరం మసాలా పొడి
2 ½ tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
1 tsp ఉప్పు తగినంత
3 రెమ్మలు కరివేపాకు
6 tsp నూనె
¼ కప్పు కొత్తి మీర
తయారీ విధానం :
ముందుగా లివర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మొత్తం కలిపి ఒక 15 నిమిషాల పాటు నాన బెట్టాలి.ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మగ్గే వరకు వేయించాలి. అలాగే పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.


ఇప్పుడు నాన బెట్టిన లివర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి.అడుగు అంట కుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.కొంచెం మగ్గాక మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా వేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి. పైకి నూనె కనిపించే అంత వరకు వేపాలి. ఇప్పుడు కొత్తి మీర తరుగు వేసి ఒకసారి కలిపి దించేసు కోవాలి. పప్పుచారు పెట్టుకుని ఈ లివర్ ఫ్రై నుంచుకుని తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: