"గుడ్"అనిపించుకోవాలనుంటే గుడ్డు కూర ఇలా ట్రై చేయండి... !

Suma Kallamadi
ప్రతిరోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కోడి గుడ్డు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కోడి గుడ్డుతో ఫ్రై చేసిన, కూర వండినగాని ఎంతో టేస్ట్ గా ఉంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం గుడ్డుతో పులుసు కూర ఎలా వండాలో వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా వండాలో తెలుసుకుందాం. !

కావాల్సిన పదార్ధాలు:

4-6 ఉడికించిన గుడ్లు

1-2 ఉల్లిపాయలు

3-5 పచ్చిమిర్చి

2-3 టమోటాలు

1 టీ స్పూన్ పసుపు

2 టీ స్పూన్స్ కారం

1 టీ స్పూన్ ధనియాలపొడి

1 టీ స్పూన్ చింతపండు గుజ్జు

1 టీ స్పూన్ బెల్లం

రుచికి తగినంత ఉప్పు

1 టీ స్పూన్ ఆవాలు

1 టీ స్పూన్ జీలకర్ర

2 రెమ్మలు కరివేపాకు

2 టీ స్పూన్స్ కొత్తమీర తరుగు

వంటకానికి సరిపడేంత నూనె

 తయారు చేయు విధానం :

ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను చిన్న చిన్న  ముక్కలుగా కోసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.  తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి ఒక నిముషంవరకు ఫ్రై చేయాలి. తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరో 5 నిముషాల వరకు వేయించాలి.అవి వేగిన తరువాత అందులోనే  పసుపు, కారం, ధనియాలపొడి వేసి మరో 3 నిముషాలపాటు ఉడికించాలి. తర్వాత టమోటా ముక్కలు వేయాలి. టమోటో ముక్కలు మగ్గిన తరువాత  చింతపండు రసం పోయాలి. తర్వాత అందులో కావాలంటే  బెల్లం వేసుకోవచ్చు. బెల్లం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఒకసారి కూరను గరిటెతో తిప్పండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లకు ఒక చాకుతో అక్కడక్కడ  గాట్లుపెట్టి పొయ్యి మీద ఉడుకుతున్న పులుసులో వేయాలి. ఒక 10 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. పైకి నూనె కనిపించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్లే.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: