బాబోయి: కోడి గుడ్లు కూడా బాంబుల పేలతాయా..?

MOHAN BABU

 ప్రపంచంలో ప్రతిరోజు పలువిధాల  వింత సంఘటనలు ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటూనే ఉంటాయి. అలాంటి సంఘటనను మనం ఎప్పుడు చూసి ఉండం. ఇలా జరిగిన సంఘటనను వారు ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా మన తెలియజేస్తుంటారు. అలాంటి సంఘటనే  ఈమెకు జరిగింది. ఉడకబెట్టిన గుడ్డు పేలడంతో ఆమె ముఖం అంతా నాశనమైంది. అవును నిజంగానే వింటున్నారు. పేలింది గుడ్డే.. అది ఎలా జరిగిందో.. ఎక్కడ జరిగిందో చూద్దాం..
 ఇటీవల కాలంలో ఒక మహిళకు ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. ఆమె ఇంట్లో కోడిగుడ్లు పేలడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ అరుదైన ఘటన ఇంగ్లాండ్ దేశంలో జరిగినది. ఇంగ్లాండ్ లో నివాసం ఉంటున్న కాన్వే అనే మహిళ కోడిగుడ్లను మైక్రోవేవ్ లో ఉడికించుకునేది. ఇలా ప్రతిరోజు ఆమె మైక్రోవేవ్ లోనే గుడ్డను ఉడికించు కునేది.  దీంతో ఒకరోజు ఆ గుడ్లు పేలాయి. ఈ ఘటనలో  ఆమెకు తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. అయితే మైక్రోవేవ్ లో  గుడ్లు  చాలా తొందరగా ఉడుకుతాయి. కేవలం 10 సెకండ్లలోనే ఆ కోడి గుడ్డు ఉడుకుతుందని భావించిన ఆమె ప్రతిరోజు అందులోనే ఉడికించడానికి మొగ్గు చూపేది. రోజు లాగానే ఆరోజు కూడా మైక్రోవేవ్ లో వాటర్ పోసి  కోడిగుడ్లను ఉడక పెట్టింది.

పది సెకన్ల తర్వాత ఆ కోడిగుడ్లను  ఆమె బయటకు తీసింది. ఆ గిన్నెలో వేడి నీళ్లలో ఉన్న కోడిగుడ్లను ఒక స్పూన్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నం చేసింది.  దీంతో ఒక్కసారిగా గుడ్డు స్పున్ కు తాకగానే అవి పేలిపోయాయి. దీంతో ఆ గిన్నె లో ఉన్నటువంటి వేడి నీళ్ళు అన్నీ  ఆమె ముఖం, మెడ మీద పడి పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మైక్రోవేవ్ లో ఉడికించడం వల్ల ఇలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సంఘటన చూసిన తర్వాత ఎవరు కూడా  మైక్రోఓవెన్ లో గుడ్లను ఉడికించరాదని తెలుస్తోంది. మైక్రోఓవెన్ లో కోడిగుడ్ల ఉడకబెడితే ప్రమాదకరమని నిపుణులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: