గోంగూర అండ్ మష్రూమ్స్ కాంబో అదుర్స్.. !
కావలిసిన పదార్ధాలు :
పుట్ట గొడుగులు - 1/4 కేజీ
ఉల్లిపాయలు. 3
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్
కారం- 2 టీ స్పూన్
పచ్చి మిర్చి -ఐదు
పసుపు- 1/4 టీ స్పూన్
కొత్తిమీర తరుగు -కొద్దిగా
నూనె -100 గ్రాములు
గోంగూర- 3 కట్టలు
తయారు చేయు విధానం:
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కాసేపు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత గోంగూరలో కూడా కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూర లో కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. తర్వాత గోంగూర ను మెత్తగా మెదపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సౌ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేయాలి.నూనె వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చి మిర్చి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకునిఅందులో ఉప్పు కారం, పసుపు వేసి కలపాలి.ఇప్పుడు ముందుగా ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను కూడా వేసి బాగా వేపాలి. అవసరమైతే టమాటా కూడా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మెత్తగా మెదిపుకున్న గోంగూర పేస్ట్ ను కూడా వేయాలి. కూర అంతా ఒకసారి గరిటెతో తిప్పి మూతపెట్టి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పైకి నూనె కనిపించే అంతవరకు కూరను పొయ్యి మీదే ఉంచండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది.