రెసిపీ : బీట్‌రూట్ తో టేస్టీ వంటలు... అనారోగ్యాన్ని బీట్ చేయండి !
బీట్ రూట్ ను శనగ పప్పుతో కలిపి తీసుకుంటే అద్భుతమైన కూర్మా తయారవుతుంది. దీన్ని చేయడానికి బీట్‌రూట్, శనగ పప్పు, కొబ్బరి తురుము మాత్రమే అవసరం. దానితో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు అవసరం. ఇందులో జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి కూడా ఉండాలి.
బీట్ రూట్ కూర్మా చేయడానికి ముందుగా కుక్కర్‌లో ఉప్పు వేసి బీట్ రూట్ ను ఉడికించాలి. ఇప్పుడు టొమాటో, ఉల్లిపాయలను పేస్ట్ చేయండి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం వేసి కలపాలి. అది వేగిన తర్వాత అందులో ఉడికించిన బీట్‌రూట్, శనగపప్పు, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి. ఆ తరువాత గ్యాస్‌ను ఆపేసి వేడిగా సర్వ్ చేయండి.
బీట్ రూట్ రైస్
బీట్‌రూట్‌ను అన్నంలో కలిపి కూడా చేసుకోవచ్చు. వండిన అన్నాన్ని చల్లార్చండి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టొమాటలతో పాటు తరిగిన బీట్‌రూట్ వేసి వేయించండి. తరువాత అన్నం, ఉప్పు వేసి కలపండి. తాలింపులో వెల్లుల్లి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ బీట్‌రూట్ ఫ్రైడ్ రైస్ రంగులో పూర్తిగా భిన్నంగా కనిపించడమే కాకుండా తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది.