సింహాలు అనుకుంటే.. కూనల్లా మారిపోయారే..!!

Balachander
ఈరోజు ఇండియా.. వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వెరీ స్పెషల్ అని చెప్పాలి.  వరకు భారీ స్కోర్ సాధించి గెలుస్తూ వచ్చిన ఇండియా జట్టు గత రెండు మ్యాచ్ లలో తక్కువ స్కోర్ చేయగలిగింది.  తక్కువ స్కోర్ చేసిన గెలుస్తామని చెప్పకనే చెప్పింది ఇండియా జట్టు.  


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా జట్టుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది.  రోహిత్ శర్మ తక్కువ స్కోర్ కె వెనుదిరిగాడు.  తరువాత వచ్చిన కోహ్లీ, రాహుల్ లు స్కోర్ ను పరుగులు తీయించారు.  48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ఔటయ్యాడు.  అనంతరం క్రీజ్ లోకి వచ్చిన విజయ్ శంకర్, జాదవ్ లు తక్కువ స్కోర్ కెవెనుదిరిగారు .  


ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ధోని నెమ్మదిగా ఆడాడు. మరో ఎండ్ లో కోహ్లీ పపరుగులు తీయించాడు.  చివర్లో ధోని మెరుపులు మెరిపించడంతో ఇండియా 7 వికెట్ల నష్ఠానికి 268 పరుగులు చేసింది.  ఇది గౌరవప్రదమైన స్కోర్ అనే చెప్పాలి. అయితే, వెస్ట్ ఇండీస్ విద్వంసకరమైన బ్యాట్స్మెన్స్ ఉండటంతో ఈ స్కోర్ ను అవలీలగా కోటేస్తారు అనుకున్నారు.  


కానీ, బౌలర్లు రాణించడంతో వెస్ట్ ఇండీస్ కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.  దీంతో ఇండియా 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా వెస్ట్ ఇండీస్ కేవలం 140 పరుగులు మాత్రమే చేయడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: