ప్రియుడి మోజులో వివాహిత‌.. భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని దారుణంగా...

Kavya Nekkanti

నేటి కాలంలో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎక్కువైపోయింది. ఈ క్ర‌మంలోనే వివాహ బంధాలకు అర్థం మారుస్తున్నారు కొందరు. దైవసాక్షిగా పెళ్లిళ్లు చేసుకుంటూ అక్రమ సంబంధాలతో వివాహాల‌కు అద్దం ప‌ట్టేలా చేస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీస్తున్న‌ ఘటనలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా ఓ వివాహిత ప్రియుడి మోజులో ఏకంగా భ‌ర్త‌నే హ‌త‌మార్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరిలోని కాటేరి కుప్పంలో కందస్వామి, భువనేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు.

 

ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. కందస్వామి ప్రైవేట్ స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కంద‌స్వామికి కారు డ్రైవర్‌గా ప‌ని చేసే అజిత్ కుమార్ అనే స్నేహితుడు ఉన్నాయి. ఈ స్నేహం పేరు అజిత్‌.. కంద‌స్వామి ఇంటికి త‌ర‌చూ వెళ్లేవాడు. ఈ క్ర‌మంలోనే అజిత్‌కు భువనేశ్వరికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం అక్ర‌మ సంబంధంగా మారింది. ఇక అటు కందస్వామి డ్యూటీకి వెళ్ల‌గానే.. ఇటు అజిత్ ఇంటికి వ‌చ్చి భువనేశ్వరి కామ‌క్రీడ‌లు కొన‌సాగించేవాడు. అయితే ఇది గ‌మ‌నించిన స్థానికులు.. కంద‌స్వామికి విష‌యం చెప్పాడు.

 

దీంతో కంద‌స్వామి తన ఇంటికి ఇక ముందు నువ్వు రాకూడదని అజిత్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్రియుడితో రాస‌లీలలు చెయ్యడానికి భర్త కందస్వామి అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా అత‌న్ని చంపాల‌ని డిసైడ్ అయింది. ఈ విష‌యాన్ని ప్రియుడితో చెప్పింది. ఇక అజిత్ కుమార్ స్నేహితుడు ప్రవీణ్ కుమార్‌తో క‌ల‌సి కంద‌స్వామిని చంపాల‌ని ప్లాన్ చేశాడు. ఈ క్ర‌మంలోనే కందస్వామి ఒంటరిగా బయటకు వెళ్లిన సమయంలో అతన్ని కారుతో ఢీకొని చంపేయాలని ప‌క్కా ప్లాన్ వేశారు.

 

ఇక మార్చి 14వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో కందస్వామి బైక్ లో బయలుదేరాడు. ఆ సమయంలో అజిత్ కుమార్ స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ఇండిగో కారు తీసుకుని అతన్ని వెంబడించాడు. అనుకున్న‌ట్టుగానే మార్గం మద్యలో కందస్వామిని కారుతో ఢీకొని వెళ్లిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన కందస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే కంద‌స్వామి కుటుంబ‌స‌భ్య‌లు.. భువనేశ్వరిపై అనుమానం వ్య‌క్తం చేయ‌డంతో.. కేసు న‌మోదు చేసిన పోలీసులు భువనేశ్వరి కాల్ లిస్ట్ ఆరా తీయ‌గా అస‌లు విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. దీంతో నింధితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: