అనంతపురంలో విషాదం.. ప్రియురాలు నో చెప్పిందని దారుణానికి పాల్పడిన ప్రియుడు..!!!
సినిమాల ను చూసి యువత ఊహా లోహంలో విహరిస్తున్నారు.. సినిమాలలో ఎలా ఉందో అది నిజ జీవితం లో జరగాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రేమ పేరు తో అమ్మాయిల ను శారీరకంగా మానసికంగా హింసిస్తూ వస్తున్నారు.. ఇక విషయానికొస్తే.. ఓ డిగ్రీ చదివే యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. దేవతలా ఆరాధించేవారు.. అలా తనని ఎలా గైనా ఒప్పించాలని పట్టు పట్టుకొని కూర్చున్నాడు..
ఓ రోజు ఆమెకు తన ప్రేమ విషయాన్ని అమ్మాయి తో మొత్తానికి చెప్పేశాడు.. దానికి ఆ అమ్మాయి నో చెప్పడంతో తట్టుకోలేక పోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న బాధ తో కుమిలిపోయాడు. జీవితం మీద విరక్తితో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చనిపోయే ముందు తన బాధను వ్యక్తం చేస్తూ లవ్ ఫెయిల్యూర్ పాటలకి టిక్ టాక్ వీడియోలు చేసి .. ఆ తరువాత రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాల లోని స్థానిక సాయి డిగ్రీ కళాశాల లో రాము అనే యువకుడు బీఎస్సీ చదువుతున్నాడు. స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. రాము ప్రేమకు నో చెప్పడంతో కుంగిపోయాడు. ఆమె లేని జీవితం తనకొద్దు అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పత్తికొండ రోడ్డులోని రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు రాము పై నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. చేతికందివచ్చిన కొడుకు ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. టిక్‌టాక్ వీడియోలు చేసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అందరిలో చర్చలకు దారి తీసింది..ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.