దారుణ ఘటన : కామంతో ఊగిపోయిన యువకుడు.. మైనర్ బాలికను చూసి ఛీ ఛీ..?
ఆడపిల్లకు రోజురోజుకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. కామందుల కోరల్లో చిక్కుకుని ఎక్కడోచోట ఆడపిల్ల జీవితం చింద్రం అయిపోతుంది, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. కామాంధుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రూపం లో కామాంధులు ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
ఇలాంటి ఘటనలు ప్రతిరోజు తెర మీదికి వచ్చి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటీవలే ఇలాంటి ఘటన మరొకటి వెలుగు లోకి వచ్చింది. సరుకుల కోసం షాప్ కి వెళ్లడమే ఆ బాలిక కు పాపం గా మారిపోయింది. ఏకంగా మైనర్ బాలిక అని కూడా చూడకుండా షాప్ యజమాని సదరు బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలంలోని చందు అనే యువకుడు కిరాణా దుకాణం ని నడుపుతున్నాడు. అయితే ఇటీవలే సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్ బాలిక సరుకుల నిమిత్తం సదరు యువకుడు దుకాణానికి వచ్చింది.
కామంతో ఊగిపోయిన ఆ యువకుడు అదే అదునుగా భావించి సదరు బాలికను లోపలికి లాక్కెళ్లాడు . వెంటనే షట్టర్ మూసి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో... పోలీసులను ఆశ్రయించారు బాలిక తల్లిదండ్రులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బుధవారం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి తోశారు.