హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
ఈ దాడిలో ఇంటిలోని వస్తువులు నాశనం చేసారు. ఈ ఘటన పూర్తి వివరాలు చూస్తే... హైదరాబాద్ పాత బస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో ఒక ఇంటిపై 20 మంది గుండాలు దాడి చేసి ఇంట్లోని వారిని గాయపరిచి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి రోడ్డుపై పడేసారు అని పోలీసులు పేర్కొన్నారు. ఇది రియల్ మాఫియా అని పోలీసులు తెలిపారు. పోలీసులు ఫిర్యాదు చేసినా సరే ఎస్సై అరవింద్ పట్టించుకోలేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు.
తమ ఇంటిలోకి చొరబడి మా తల్లి పై దాడి చేశారు అని ఫిర్యాదు చేసారు అని పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న అరవింద్ మీ ఇంటి పత్రాలు తీసుకొని రావాలి అని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. డయల్ 100 తో స్పందించిన ఛత్రినాక ఇన్స్ పెక్టర్ విద్య సాగర్ రెడ్డి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్టు, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అ 20 మంది గుండాలను అరెస్ట్ చేయాలని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను, అక్కడికి వచ్చిన మీడియాను కోరారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అసలు ఎందుకు జరిగింది ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.